Salaar Day 2 Collection :రెబల్ స్టార్ ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన 'సలార్' బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతోంది. ముందుగా అంచనా వేసిన ప్రకారమే కలెక్షన్లలో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి రోజే దేశవ్యాప్తంగా రూ.93.45 కోట్లు వసూల్ చేసింది. ఇదే జోరును రెండో రోజూ ప్రదర్శిస్తూ అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ.57.61 కోట్ల కలెక్షన్లు సాధించింది. దీంతో రెండో రోజుల్లోనే సినిమా రూ. దాదాపు రూ.150కోట్లు దాటింది. ఇక వరల్డ్‌వైడ్‌గా సలార్ తొలిరోజు రూ. 178.7 కోట్లు వసూల్ చేసింది. ఈ క్రమంలో 2023లో అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్లు చేసిన సినిమాగా 'సలార్' నిలిచింది.
Salaar Box Office Collection Worldwide :వరల్డ్‌వైడ్‌గా తొలిరోజు రూ.178 కోట్లు వసూల్ చేసిన ఈ చిత్రం రెండో రోజు రూ.117 కోట్ల కలెక్షన్ సాధించింది. మొత్తం రెండు రోజుల్లో వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.295 కోట్లుగా నమోదైంది. ఇక రానున్న రెండు రోజులు సెలవులు కావడం వల్ల కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.