Salaar day 10 Collection :పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ మువీ బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులను సృష్టిస్తోంది. వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన 10 రోజుల్లో ప్రపంచవ్యప్తంగా (Salaar Collection Worldwide) ఈ సినిమా రూ.625 కోట్లు వసూలు చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది.
Salaar Box Office Collection :సలార్‌కు ఒక్క రోజు ముందు విడుదలైన 'డంకీ' సినిమా బాక్సాఫీసు ముందు అనుకున్న స్థాయిలో ప్రదర్శన చేయలేపోయింది. దీంతో సలార్ అడ్డు లేకుండా దూసుకెళ్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ మాస్ యాక్షన్ కోసం ఫ్యాన్స్ రిపీట్ మోడ్‌తో థియేటర్లకు వెళ్తున్నారు. మధ్యలో కలెక్షన్లు నెమ్మదించినా ఈ వీకెండ్లో వసూళ్లు మళ్లీ పుంజుకున్నాయి. శనివారం ఈ సినిమా రూ.12.55 కోట్లు సాధించగా, ఆదివారం రూ.15.74 కోట్లు రాబట్టిందని సినీ ట్రేడ్ వర్గాల సమాచారం. శనివారంతో పోల్చితే ఆదివారం పదోరోజు 25.42 శాతం ఎక్కువ వసూళ్లు రాబట్టిందని తెలుస్తోంది. ఫలితంగా భారత్‌లో ఈ సినిమా రూ.346.88 కోట్లు సాధించింది. ఈ సినిమా రిలీజ్ రోజు రూ.178.7 కోట్లు కలెక్షన్లు రాబట్టిందని అంతకుముందు చిత్ర బృందం తెలిపింది. దీంతో 2023లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది.