Salaar Collection :పాన్ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ మువీ బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులను సృష్టిస్తోంది. వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన అన్ని సెంటర్లో సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ప్రపంచవ్యప్తంగా ఇప్పటి వరకు ఈ సినిమా రూ.500 కోట్లు వసూలు చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. బాక్సాఫీస్ రికార్డులను దేవ రిపేర్ చేస్తున్నాడని ప్రకటించింది.
ఫస్ట్ డేనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.178.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను అందుకుంది. ఇక రెండో రోజు దాదాపు రూ.300 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, మూడో రోజు రూ.400 కోట్ల మార్క్‌ను దాటేసింది. తాజాగా ఈ చిత్రం రూ.500 కోట్ల మార్క్‌ను దాటినట్లు నిర్మాతలు తెలియజేశారు. ఆరు రోజుల్లో ఈ చిత్రం రూ.500 కోట్ల గ్రాస్‌ను క్రాస్ చేసిందని వెల్లడించారు. మొదటి వారం పూర్తి కాకుండానే రూ.500 కోట్ల మార్క్‌ను అందుకున్న ఈ చిత్రం, త్వరలోనే రూ.1000 కోట్ల మార్క్‌ను కూడా క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రెండు పార్టులుగా తెరకెక్కిన సలార్ ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఖాన్సార్ అనే ఒక అండర్ వరల్డ్ సిటీ సింహాసనం కోసం మూడు ట్రైబల్ ఫ్యామిలీస్ మధ్య జరిగే యుద్ధం నేపథ్యంతో ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. ఇక మూవీలో ప్రభాస్ మాస్ యాక్షన్ కోసం ఫ్యాన్స్ రిపీట్ మోడ్‌తో థియేటర్లకు వెళ్తున్నారు.
సలార్ బిజినెస్ ఎంతంటే?
సలార్ సినిమాకు నైజాంలో రూ. 60 కోట్లు, సీడెడ్‌లో రూ. 24 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 60 కోట్లతో కలిపి తెలుగులో రూ. 120 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్ణాటకలో రూ. 30 కోట్లు, తమిళనాడులో రూ. 12 కోట్లు, హిందీలో రూ. 75 కోట్లు, రెస్టాఫ్ ఇండియా మొత్తంలో రూ. 3 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 75 కోట్లతో మొత్తం రూ.345 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీనిబట్టి చూస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు రూ.700 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. అంటే ఈ చిత్రం మరో రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను అందుకుంటే బ్రేక్ ఈవెన్ అయ్యినట్లే.