Salaar Box Office Prediction :పాన్ఇండియా స్టార్ ప్రభాస్, కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ మరో రోజులో థియేటర్లలో సందడి చేయనుంది. డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు సినిమా లవర్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన సలార్ సెకండ్ ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేసింది. దీంతో సలార్ మూవీని ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడి మరీ టికెట్లు బుక్ చేసుకుంటున్నారు.
ఓవర్సీస్తోపాటు ఉత్తరాదిలో అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడో స్టార్ట్ అవ్వగా తెలుగు రాష్ట్రాల్లో మంగళవారమే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఆన్లైన్లో సలార్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలో సలార్ డే1 అడ్వాన్స్ బుకింగ్స్ రూ.50కోట్ల మర్క్ దాటిపోయాయట. దీంతో ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ.100 కోట్ల కొల్లగడుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణసంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిజాంలో ముందుగా ఆఫ్‌లైన్ టికెట్ల అమ్మకం ప్రారంభించింది. అంటే సెలెక్టెడ్ థియేటర్స్‌లో కౌంటర్ వద్దకు వెళ్లి టికెట్స్ తీసుకోవాలన్నమాట. ఈ విషయం తెలియగానే ఆడియన్స్ థియేటర్స్ వద్ద బారులు తీరారు. ఇక ఆ తర్వాత కొన్ని గంటలకు ఆన్లైన్లో బుకింగ్ ఓపెన్ చేశారు. బుక్ మై షో లో అలా ఓపెన్ పెట్టగానే టికెట్స్ బుక్ చేసుకోవడానికి అందరూ ఒక్కసారిగా పోటీపడ్డారు.