తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బాక్సాఫీస్ వద్ద 'సలార్' ప్రభంజనం- 4రోజుల్లోనే రూ.500కోట్లు వసూల్! - సలార్ బాక్సాఫీస్ కలెక్షన్లు నాలుగో రోజు

Salaar Box Office Collection Day 4 : దేశంలో సలార్ సినిమా ప్రభంజనం కొనసాగుతోంది. భారీ బడ్జెట్​తో తెరకెక్కించిన ఈ యాక్షన్ ఫిల్మ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. దేశవ్యాప్తంగా నాలుగు రోజుల్లోనే సలార్ రూ.250 కోట్ల మార్క్ అందుకుంది.

Salaar Box Office Collection Day 4
Salaar Box Office Collection Day 4

By ETV Bharat Telugu Team

Published : Dec 26, 2023, 9:04 AM IST

Updated : Dec 26, 2023, 10:18 AM IST

Salaar Box Office Collection Day 4 : రెబల్ స్టార్ ప్రభాస్ 'సలార్ పార్ట్ 1'తో బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తున్నారు. డిసెంబర్ 22న రిలీజైన ఈ సినిమా దేశవ్యాప్తంగా థియేటర్లలో హౌస్​ ఫుల్​ షో స్​తో దూసుకుపోతోంది. ఇక లాంగ్ వీకెండ్ కావడం వల్ల మూడు, నాలుగు రోజుల్లో కూడా కాసుల వర్షం కురిసింది. దేవవ్యాప్తంగా ఈ సినిమా నాలుగో రోజు రూ.42.50 కోట్లు వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ లెక్కన నాలుగు రోజుల్లోనే దేశవ్యాప్తంగా సలార్ రూ.250 కోట్ల మార్క్ అందుకుందన్నమాట.

సలార్ రోజువారి కలెక్షన్లు (దేశవ్యాప్తంగా)

  • తొలి రోజు- 90.70 కోట్లు
  • రెండో రోజు- 56.35 కోట్లు
  • మూడో రోజు- 62.05
  • నాలుగో రోజు- 42.50 కోట్లు

Salaar Worldwide Collection : ప్రపంచవ్యాప్తంగా సలార్ 3రోజుల్లోనే రూ.402 కోట్లు వసూలు చేసింది. నాలుగో రోజు దేశవ్యాప్తంగా రూ.42.50కోట్లు కలెక్షన్లు రావడం వల్ల ఇప్పటికే రూ.450కోట్లు దాటేసింది. అయితే వరల్డ్​వైడ్​గా నాలుగు రోజుల్లో ఈజీగా రూ.500కోట్ల మార్క్ అందుకుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక తొలి రోజు వరల్డ్​వైడ్​గా రూ.176 కోట్లు, రెండో రోజు రూ.119 కోట్లు, మూడో రోజు రూ.107 కోట్ల కలెక్షన్లు సాధించింది.

ఇక సినిమా విషయానికొస్తే ప్రభాస్‍తో పాటు మాలీవుడ్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీ రోల్​లో నటించారు. ప్రాణ స్నేహితులుగా ఉండే వీరు బద్ద శత్రువులుగా ఎలా మారారు అనే విషయంపై ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంలో శ్రుతి హాసన్, ఈశ్వరీ రావు, జగపతి బాబు, శ్రియా రెడ్డి, బాబీ సింహా తదితరులు కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్​పై ప్రొడ్యూసర్ విజయ్ కిరంగదూర్ ఈ సినిమా నిర్మించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.

Salaar Making Video : భారీ వసూళ్లతో సలార్ దూసుకెళ్తున్న నేపథ్యంలో సినీ ప్రియులకు 'సలార్‌' టీమ్‌ ఆదివారం సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. మూవీ మేకింగ్‌ వీడియో షేర్‌ చేసింది. 'సలార్‌ సీజ్‌ఫైర్‌'ను తీర్చిదిద్దడంలో వేలాదిమంది భాగమయ్యారని టీమ్‌ పేర్కొంది.

'సలార్'​కు ఓకే చెప్పింది అందుకే!- పార్ట్ 2 వేరే లెవల్​ : ప్రభాస్

సలార్ వీర కుమ్ముడు- 3రోజుల్లో రూ.400కోట్లు- ప్రభాస్​​ దెబ్బా మజాకా!

Last Updated : Dec 26, 2023, 10:18 AM IST

ABOUT THE AUTHOR

...view details