తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Salaar Advance Booking USA : అడ్వాన్​ బుకింగ్స్​లో 'సలార్' జోరు.. అవి టిక్కెట్లా.. హాట్​ కేకులా.. - సలార్​ మూవీ టికెట్​ బుక్కింగ్స్

Salaar Advance Booking USA : ప్రభాస్​- ప్రశాంత్​ నీల్​ కాంబోలో రూపొందుతున్న 'సలార్'​ మూవీ ఇప్పుడు నెట్టింట హాట్​ టాపిక్​గా మారింది. ఇప్పటికే టీజర్​తో హైప్​ క్రియేట్​ చేసిన ఈ సినిమా అడ్వాన్స్​ బుకింగ్స్​లోనూ జోరు చూపిస్తోందట. ఆ విశేషాలు మీ కోసం..

salaar advance bookings
సలార్ అడ్వాన్స్​ బుకింగ్స్

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2023, 4:39 PM IST

Salaar Advance Booking USA :పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్‌ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న యాక్షన్​ థ్రిల్లర్​ మూవీ 'సలార్‌'. ప్రశాంత్​ నీల్​ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం డార్లింగ్​ ఫ్యాన్స్​ నుంచి మూవీ లవర్స్ వరకు అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీజర్​తో గూస్​బంప్స్​ తెప్పించిన ఈ మూవీ.. అప్పుడప్పుడు వైరల్​ వార్తలతోనూ నెట్టింట ట్రెండ్​ అవుతోంది. అయితే ఈ సినిమా విడుదలకు నెల రోజుల ముందు నుంచే అమెరికాలో రికార్డు సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా అమెరికాలో 'సలార్‌' టికెట్స్‌ అడ్వాన్స్‌ బుకింగ్‌ ప్రారంభమైంది. అయితే విడుదలైన కొద్ది క్షణాల్లోనే ఈ టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడైపోయాయట. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టర్లు ట్విటర్‌లో తెగ ట్రెండ్​ అవుతోంది. దీన్ని బట్టి చూస్తుంటే ఈ సినిమా ఓవర్సీస్‌ బాక్సాఫీస్‌ వద్ద మంచి సక్సెస్​ను అందుకునేలా ఉందంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Salaar Movie Cast : ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'కేజీఎఫ్‌' సిరీస్​ ఎంతటి ఘన విజయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా లెవెల్​లో విడుదలైన ఈ సినిమాలు విదేశాల్లో కూడా మంచి టాక్​ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాల తర్వాత ప్రశాంత్​ నీల్​ డైరెక్షన్‌లో వస్తోన్న చిత్రం కావడం వల్ల మూవీ లవర్స్​ అంతా 'సలార్‌'పై భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. మరోవైపు శ్రుతి హాసన్​, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, మధు గురుస్వామి, ఈశ్వరీ రావు, శ్రీయా రెడ్డి, రామచంద్రరాజు, టీను ఆనంద్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నందున ఈ సినిమా మరింత హైప్​ పెంచేసింది.

Salaar Movie Promotions : మరోవైపు ఈ సినిమా సెప్టెంబర్‌ 28న పాన్ ఇండియా లెవెల్​లో విడుదలకానుంది. దీంతో సెప్టెంబర్‌ మొదటి వారం నుంచే మూవీ టీమ్​ ప్రమోషన్లను ప్రారంభించనున్నారట. ఈ క్రమంలో త్వరలోనే ఫస్ట్‌ సింగిల్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారట. హోంబలే ఫిలింస్‌ విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మొదటి భాగం షూటింగ్​ పూర్తి చేసుకోగా.. నిర్మాణానంతర పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

Salaar Movie : 'సలార్' ఫ్యాన్స్​కు షాక్​​!.. సినిమాలో అవి లేనట్టేనా?

Prabhas Role in Salaar : 1000 మందితో ప్రభాస్​ ఫైట్​.. ఒక్కరు కాదు ఇద్దరు..

ABOUT THE AUTHOR

...view details