తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఓవర్సీస్​లో ప్రభాస్ మేనియా- అడ్వాన్స్​ బుకింగ్స్​లో 'సలార్' జోరు- తొలి రోజు రూ.100 కోట్లు పక్కా! - రెబల్ స్టార్ ప్రభాస్ సలార్

Salaar Advance Booking Collection Worldwide : రెబల్​ స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్' సినిమా డిసెంబర్ 22న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం అడ్వాన్స్​ బుకింగ్స్​ జోరందుకున్నాయి. టికెట్లు హాట్​ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్​లో ప్రభాస్​ మేనియా కొనసాగుతోంది. ఇప్పటివరకు అడ్వాన్స్​ బుకింగ్స్​లో 'సలార్' ఎంత కలెక్ట్ చేసిందంటే?

Salaar Advance Booking Collection Worldwide
Salaar Advance Booking Collection Worldwide

By ETV Bharat Telugu Team

Published : Dec 19, 2023, 7:46 AM IST

Updated : Dec 19, 2023, 8:01 AM IST

Salaar Advance Booking Collection Worldwide : రెబల్​ స్టార్ ప్రభాస్​, కేజీఎఫ్​ ఫేమ్​ ప్రశాంత్​ నీల్ కాంబినేషన్​లో వచ్చిన సినిమా సలార్. ఈ చిత్రం డిసెంబర్ 22న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ రిజీజ్​కు ముందే రికార్డులు బద్దలుకొడుతోంది. అడ్వాన్స్​ బుకింగ్స్​లో దూసుకెళ్తోంది. ప్రభాస్​ ఇమేజ్​తో 'సలార్​' టికెట్లు హాట్​కేకుల్లా అమ్మడవుతున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే వరల్డ్​ వైడ్​గా ఇంకా పలు దేశాల్లో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కావాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆడ్వాన్స్​ బుకింగ్స్​లో 'సలార్' రూ.21 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం.

'సలార్' అడ్వాన్స్ బుకింగ్స్ :'సలార్' సినిమా బుకింగ్స్ ఉత్తరాదిలో ఆదివారం (డిసెంబర్ 17) ప్రారంభమయ్యాయి. ఇక్కడ సలార్​కు భారీ వసూళ్లు నమోదవుతున్నాయి. హిందీలో 15 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇతర భాషల్లో 10 వేలకు పైగా టికెట్లను సినీ ప్రేక్షకులు అడ్వాన్స్​ బుకింగ్ చేసుకున్నారు. పీవీఆర్​, ఐనాక్స్​లో స్క్రీన్లలోనే దాదాపు 25 వేల టికెట్లు బుక్​ అయ్యాయట. దీని ద్వారా రూ.5 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో తొలి రోజు అడ్వాన్స్​ బుకింగ్స్​ కలెక్షన్స్​ రూ.4.29 కోట్ల మేర ఉన్నట్లు సమాచారం.

'సలార్' ఓవర్సీస్‌ అడ్వాన్స్ బుకింగ్స్ : 'సలార్' ఓవర్సీస్​లోనూ అదరగొడుతోంది. అమెరికా, కెనడాలో ఇప్పటి 1.2 మిలియన్ డాలర్లు వసూలు చేసిందని తెలుస్తోంది. యూఏఈ, మిడిల్ ఈస్ట్​ లో లక్ష డాలర్లు, యూకేలో 2 లక్షల పౌండ్లు వసూలు చేసిందట. మొత్తంగా 'లార్' ఓవర్సీస్​లో రు.16 కోట్లు (2 మిలియన్ డాలర్లు) కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. దీంతో వరల్డ్​ వైడ్​గా అడ్వాన్స్ బుకింగ్స్​ ద్వారా 'సలార్' మొత్తంగా​ రూ.21 కోట్లు రాబట్టినట్లైంది. దీన్ని బట్టి చూస్తే తొలి రోజు ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్​ పక్కా సాధిస్తుందని సినీ ట్రెడ్​ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.

Salaar Cast :కేజీఎఫ్, కాంతార వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్స్మ్ సలార్ మూవీని నిర్మించింది. సినిమాలో ప్రభాస్‌తో పాటు స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, మీనాక్షి చౌదరి, ఈశ్వరి రావు, శరణ్ శక్తి తదితరలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

వరుణ్​ తేజ్​ 'ఆపరేషన్​ వాలెంటైన్'​- కొత్త లుక్​తో ఆకట్టుకుంటున్న మెగాప్రిన్స్

వైలెంట్​గా 'సలార్' సెకండ్ ట్రైలర్- ప్రభాస్ డైలాగ్స్​కు గూస్​బంప్సే!

Last Updated : Dec 19, 2023, 8:01 AM IST

ABOUT THE AUTHOR

...view details