ప్రభాస్‌తో సినిమా అంటే చాలు తోటి నటులకు నిజంగా ఫుల్మీల్సే. సెట్స్‌లో ఉన్న నటులకు రకరకాల వంటలను తెప్పించి రుచిచూపిస్తాడు. అందుకే ప్రభాస్ ఆతిథ్యానికి ఫిదా అవ్వని నటుడంటూ లేరు. సెట్లో ప్రభాస్‌తో గడిపిన క్షణాల గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కూడా ప్రభాస్‌ను పొగడ్తలతో ముంచెత్తింది. సలార్‌లో ఈ రెబల్ స్టార్ సరసన నటిస్తున్న శృతి.. ఇతరులకు కడుపు నిండా తినిపించడమే ప్రభాస్ అత్యుత్తమ లక్షణం అని చెప్పుకొచ్చింది.
తోటి వారికి ఇలా కడుపు నిండా భోజనం పెట్టేవారికి ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఉంటుందని శృతిహాసన్ తెలిపింది. ప్రభాస్ నిజంగా చాలా ప్రేమగా భోజనం పెడతాడని చెప్పుకొచ్చింది. శృతి చేసిన కామెంట్స్ విని అభిమానులు ఖుషీ అయిపోతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ 'సలార్', 'ఆదిపురుష్', 'ప్రాజెక్ట్ కే' చిత్రాలతో బిజీగా ఉన్నారు. త్వరలో మారుతీ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నారు. మరోవైపు శృతిహాసన్ తెలుగులో 'సలార్'తో పాటు చిరంజీవి సరసన 'వాల్తేరు వీరయ్య'లో నటిస్తోంది.