Salaar Action Promo :ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం 'సలార్' మేనియా నడుస్తోంది. డిసెంబర్ 22న రిలీజైన సినిమా, ఇప్పటికీ హౌస్ ఫుల్ షో స్తో థియేటర్లలో రన్ అవుతోంది. దీంతో ఈ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో మూవీటీమ్ బుధవారం 'యాక్షన్ ప్రోమో' వీడియో గ్లింప్స్ రిలీజ్ చేసింది. ఫుల్ వైలెన్స్‌తో కూడిన ఈ వీడియోకు బీజీఎమ్ హైలైట్‌గా నిలిచింది. మీరూ ఆ ప్రోమో చూసేయండి.
Salaar Box Office Collection :కలెక్షన్లలోనూ సలార్ జోరు ప్రదర్శిస్తోంది. వీకెండ్, క్రిస్మస్ హాలీడేస్ తర్వాత కూడా డీసెంట్ కలెక్షన్లు సాధిస్తోంది. దేశవ్యాప్తంగా సలార్ ఐదో రోజు రూ.23.50 కోట్లు వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. దీంతో 5 రోజుల్లో మొత్తం దేశవ్యాప్తంగా సలార్ వసూళ్లు రూ.278.90 కోట్లకు చేరాయి.
సలార్ రోజువారి కలెక్షన్లు (దేశవ్యాప్తంగా)
- తొలి రోజు- 90.70 కోట్లు
- రెండో రోజు- 56.35 కోట్లు
- మూడో రోజు- 62.05
- నాలుగో రోజు- 42.50 కోట్లు
- ఐదో రోజు- 23.50 కోట్లు
నార్త్ అమెరికాలోనూ తగ్గేదేలే : భారత్‌తోపాటు సలార్ ఓవర్సీస్లోనూ రికార్డు స్థాయిలో వసూళ్లు అందుకుంటుంది. ఒక్క నార్త్ అమెరికాలోనే ఇప్పటివరకు 6.92 మిలియన్ డాలర్ల కలెక్షన్లు సాధించినట్లు మూవీమేకర్స్ పేర్కొన్నారు. ఇక మొత్తం ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా రూ.90కోట్ల మార్క్ దాటినట్లు తెలుస్తోంది.
పరుచూరి ప్రశంసలు : సలార్ గ్రాండ్ సక్సెస్ అందుకోవడం వల్ల మూవీటీమ్‌కు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. "వర్షం', 'పౌర్ణమి' సినిమాల నుంచి ప్రభాస్‌ను చూస్తున్నా. ఒక్కమాటలో చెప్పాలంటే అతడు మంచితనానికి మారుపేరు. ఎంత ఎదిగినా ఎప్పుడూ ఒదిగే ఉంటాడు. నేటి తరం హీరోల్లో అందరి కంటే ముందు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. 'బాహుబలి' ప్రభాస్‌కు ఓ వరం. ఆ సినిమాతోనే అందరి హృదయాల్లో స్థానం సంపాదించాడు. ఇప్పుడు 'సలార్'తో మరో విజయం అందుకున్నాడు. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఒక జానపద కథను యాక్షన్ చిత్రంగా రూపొందించారు. దీని వెనుక 'బాహుబలి' స్ఫూర్తి ఉండొచ్చని అనుకుంటున్నా. ఇందులోని పాత్రలన్నీ అద్భుతాలే" అని పరుచూరి అన్నారు.
'సలార్'లో అసలు నా పాత్ర లేదు - ఎంత చెప్పినా నీల్ వినలేదు'
బాక్సాఫీస్ వద్ద 'సలార్' ప్రభంజనం- 4రోజుల్లోనే రూ.500కోట్లు వసూల్!