Saindhav Twitter Review :టాలీవుడ్ స్టార్ హీరోవిక్టరీ వెంకటేశ్ లీడ్ రోల్లో థియటర్లలోకి వచ్చిన లేటెస్ట్ మూవీ సైంధవ్. యాక్షన్, సెంటిమెంట్ బ్యాక్‌డ్రాప్‌తో సాగిన ఈ మూవీ శనివారం (జనవరి 13న ) ప్రేక్షకుల ముందుకొచ్చింది. టీజర్, ట్రైలర్‌తో ఆద్యంతం అభిమానుల్లో ఆసక్తి పెంచింది. ఇక ఇప్పటికే ప్రీమియర్స్ చూసిన ఆడియెన్స్ ఈ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే ?
ప్రస్తుతం ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా ఉందని తొలుత సినిమా స్లో గా సాగినప్పటికీ ఓ ముప్పై నిమిషాల తరువాత ఫుల్ ఫామ్‌లోకి వచ్చిందని అంటున్నారు. ఇక యాక్షన్ సీక్వెన్స్, పర్ఫామెన్స్‌లతో స్టార్స్ అందరూ ఆకట్టుకున్నారని తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. బీజీఎం బాగుందని కితాబులిస్తున్నారు. ఇక నవాజుద్దిన్ సిద్దిఖీ యాక్టింగ్, వెంకీ మామ చేసిన కొన్ని సీన్లు, క్లైమాక్స్ మాత్రం అద్భుతంగా అనిపిస్తాయని అంటున్నారు.
మరోవైపు ఈ సినిమాలోని సెకండ్ హాఫ్ బాగుందంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఓవరాల్‌గా హిట్టు బొమ్మ అని చెబుతున్నారు. అటు వెంకీ మామ ఫ్యాన్స్ కూడా తమ ఫేవరట్ స్టార్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇందులో ఆయన యాక్షన్ సీన్స్ బాగున్నాయని, తన నట విశ్వరూపం చూపించారంటూ చెప్పుకొస్తున్నారు.