Saindhav Teaser :లెక్కమారుతుందంటూ 'సైంధవ్' టీజర్‌తో అదరగొట్టేశారు హీరో వెంకటేశ్. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ టీజర్ చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఇందులో వెంకటేశ్ తన పవర్ఫుల్ యాక్షన్, డైలాగ్స్‌తో ఆకట్టుకున్నారు. తండ్రి కూతుళ్ల సెంటిమెంట్‌తో ఈ సినిమా సాగనుంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం వెంకటేశ్‌కు తొలి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. .
ఫ్యామిలీ ఎపిసోడ్స్‌తో ప్రారంభమైన ఈ టీజర్లో చంద్రప్రస్థ అనే ఊరిలో తన భార్య, కూతురితో కలిసి వెంకటేశ్ సంతోషంగా జీవిస్తుంటాడు. ఆ తర్వాత విలన్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఎంట్రీతో కంప్లీట్ యాక్షన్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. వికాస్ అనే కరుడుగుట్టిన క్రిమినల్‌గా, తనకు ఎదురొచ్చిన వారందరిని దారుణంగా చంపేస్తూ నవాజుద్ధీన్ సిద్ధిఖీ కనిపించారు. బ్లడ్ సీన్స్ ఎక్కువగానే కనిపించాయి. పీకలు కోయడం, కత్తి పట్టి నరకడం వంటి సీన్లను చూపించారు. అనంతరం విలన్ దృష్టిలో సైకోగా వెంకటేశ్‌ను.. ఓ సారి కత్తితో మరోసారి గన్‌తో శత్రు సంహారం చేస్తూ పవర్‌ఫుల్‌గా చూపించారు.
వెంకటేశ్‌పై చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్‌గా ఉన్నాయి. 'వెళ్లేముందు చెప్పెళ్ల... వినలేదు. అంటే భయం లేదు. లెక్క మారుద్దిరా నా కొడక్కల్లారా' అంటూ టీజర్ చివరలో వెంకటేక్ ఊచకోత కోశారు. డైలాగ్ కూడా అదిరిపోయింది. చిన్న పిల్లలకు గన్ ట్రైనింగ్ ఇచ్చి.. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌కు సప్లై చేసే గ్యాంగ్‌ను ఎదురించే వ్యక్తిగా వెంకటేశ్ కనిపిస్తున్నారు. సంతోశ్ నారాయణన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా టీజర్‌ను బాగా ఎలివేట్ చేసింది. వెంకటేశ్‌ను మునుపెన్నడూ చూడనంత వైల్డ్‌గా ప్రెజెంట్ చేయడానికి శైలేష్ కొలను ప్రయత్నించినట్లు అర్థమవుతోంది. ఫైనల్‌గా ఈ టీజర్ అంచనాలకు మించి బాగా అదరగొట్టింది.