Saindhav Ruhani Sharma : 'చి.ల.సౌ'తో పరిచయమైన హీరోయిన్ రుహానీ శర్మ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కెరీర్లో ముందుకెళ్తోంది. తన గ్లామర్‌తో కుర్రకారును ఫిదా చేసిన ఈ భామ 'హిట్' సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. అనంతరం తెలుగుతో పాటు వేరే భాషల్లో అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈ సంక్రాంతికి తెలుగులో వెంకటేశ్ సైంధవ్ సినిమాతో రాబోతుంది. అయితే తాజాగా ఈ భామ ఓ షాప్ ఓపెనింగ్ వచ్చి మీడియాతో సరదాగా ముచ్చటించింది. తన గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ తనకు సిస్టర్ అవుతుందని, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన బావ అని చెప్పుకొచ్చింది.
"వెంకటేశ్ గారి చాలా సినిమాలు చూశాను. ఎక్కువగా హిందీ డబ్బింగ్ చిత్రాలు చూశాను. ఆయనంటే చాలా అభిమానం ఉంది. చిన్నప్పుడు నేను డాక్టర్ అవ్వాలి అనుకున్నాను. కానీ ఆ తర్వాత నా డ్రీమ్ మారిపోయింది. ఇప్పుడు యాక్టర్ అయిపోయాను. సైంధవ్ మూవీలో డాక్టర్‌గా పనిచేయడం చాలా ఆనందంగా అంది. కనీసం ఇలా అయినా నా చిన్నప్పటి కల నెరవేరింది" అని చెప్పింది.
కోహ్లీ బావ : అవును. కానీ దీని గురించి ఎప్పుడూ చెప్పలేదు. అయినా మీకెలా తెలిసింది? అనుష్క శర్మ నాకు సిస్టర్ అవుతుంది. విరాట్ కోహ్లీ బావ. వారిద్దరు చాలా మంచిగా, ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా సింపుల్‌గా ఉంటారు. అందుకే వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. కోహ్లీ చాలా మంచివారు." అని రుహాని శర్మ పేర్కొంది. ఈ విషయం తెలుసుకుంటున్న నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.