తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఇంకెందుకు? మా బెడ్‌రూమ్‌లోకి వచ్చేయండి: బాలీవుడ్‌ హీరో - సైఫ్​ అలీ ఖాన్ బెడ్​ రూమ్​

బాలీవుడ్​ బ్యూటీ మలైకా అరోరా తల్లి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వస్తున్న బీటౌన్​ జంట సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్​ను ఫొటోగ్రాఫర్లను వెంబడించారు. దీంతో విసుగెత్తిన సైఫ్​.. ఫన్నీ కౌంటర్​ ఇచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్​మీడియాలో వైరల్​గా మారింది.

saif ali khan
saif ali khan

By

Published : Mar 3, 2023, 7:20 PM IST

సాధారణంగా సెలబ్రిటీలు కనిపిస్తే చాలు కెమెరాలు క్లిక్‌మనిపించకుండా ఉండలేరు. వారినే ఫాలో అవుతూ ప్రతి కదలికను క్యాప్చర్‌ చేయాలనుకుంటారు. కొన్నిసార్లు తారలకు ఇది విసుగు పుట్టిస్తుంది. స్వేచ్ఛగా ఉండనివ్వడం లేదని విసుక్కుంటారు కూడా. సహనం నశించినప్పుడైతే ఇక చాలు అని నిర్మొహమాటంగా హెచ్చరిస్తారు. వారి లుక్స్‌ను కెమెరాల్లో బంధించే పనిలో బిజీగా ఉండే కెమెరామన్లు వాళ్ల మాటలను పెద్దగా పట్టించుకోరు. ఇది తరచూ జరిగే వ్యవహారమే.

తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ సైఫ్‌ అలీ ఖాన్‌, కరీనా కపూర్‌ ఓ పార్టీకి వెళ్లారు. మలైకా అరోరా తల్లి జోయ్‌సీ 70వ పుట్టినరోజు వేడుకలకు వీరు జంటగా హాజరయ్యారు. అనంతరం పార్టీ నుంచి తిరిగి ఇంటికి వచ్చేసిన వీళ్లను కొందరు వెంబడిస్తూ ఫొటోలు తీశారు. దీంతో విసుగెత్తిన సైఫ్‌.. 'ఓ పని చేయండి, మా బెడ్‌రూమ్‌లోకి కూడా వచ్చేయండి' అని సరదాగా వ్యాఖ్యానించారు. అది విని కరీనా చిన్నగా ఓ నవ్వు నవ్వింది. వెంటనే అక్కడున్న ఓ ఫొటోగ్రాఫర్‌ 'సైఫ్‌ సర్‌, మీరంటే మాకెంతో ఇష్టం' అని అరిచాడు. దీనికి సైఫ్‌ 'మాకూ మీరంటే ఎంతో ఇష్టం' అని రిప్లై ఇస్తూ హడావుడిగా లోనికి వెళ్లిపోయారు.

ఇక సైఫ్‌ సినిమాల విషయానికి వస్తే.. ఆయన చివరగా 'విక్రమ్‌ వేద' సినిమాలో కనిపించారు. ప్రస్తుతం ఆయన దర్శకుడు ఓం రౌత్‌ తెరకెక్కిస్తున్న 'ఆదిపురుష్‌'లో రావణుడిగా నటిస్తున్నారు. కరీనా కపూర్‌ చేతిలో 'ద డివోషన్‌ ఆఫ్‌ సస్పెక్ట్‌ ఎక్స్‌', 'ద క్య్రూ' చిత్రాలున్నాయి. అలాగే హన్సల్‌ మెహతా డైరెక్షన్‌లో త్వరలో కరీనా సినిమా చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details