తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'సీత'గా సాయిపల్లవి.. ఆ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ! - సాయి పల్లవి బాలీవుడ్​ మూవీ

మలయాళం ఇండస్ట్రీ ద్వార సినీ రంగ ప్రవేశం చేసిన నేచురల్​ బ్యూటీ సాయిపల్లవి. తన తొలి సినిమాతోనే ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఈ తార తెలుగు నాట అందర్నీ ఫిదా చేసింది. అటు టాలీవుడ్​లో ఇటు కోలీవుడ్​లో దూసుకెళ్తున్న ఈ కుట్టీ ఇప్పుడు బాలీవుడ్​లోనూ తన ట్రెండ్​ సెట్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఆ సంగతులు..

sai pallavi bollywood movie
sai pallavi

By

Published : Dec 7, 2022, 2:55 PM IST

Sai Pallavi Bollywood Entry : ఫిదా సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి అద్భుతమైన నటనతో అందరినీ ఆశ్చర్యపరచింది సాయిపల్లవి. తర్వాత సెలక్టివ్‌గా సినిమాలు ఎంచుకుంటూ యూత్‌కే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌కూ దగ్గరైంది. తాజాగా ఈ అందాల తార తర్వాతి సినిమాకు సంబంధించిన ఓ న్యూస్‌ నెట్టింట వైరల్‌గా మారింది. సాయి పల్లవి బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది.

స్టార్‌హీరో రణబీర్‌ కపూర్‌ నటిస్తున్న ఓ సినిమాలో ఆయన సరసన ఈమె నటిస్తోందట. రణబీర్‌ శ్రీరాముడి పాత్రలో కనిపించనుండగా సీతగా సాయి పల్లవి అలరించనుందట. ముందు ఈ పాత్ర కోసం దీపికా పదుకొణె, కరీనా కపూర్‌ పేర్లు వినిపించాయి. కానీ దర్శకనిర్మాతలు సాయి పల్లవిని ఫైనల్‌ చేసినట్లు సమాచారం. ఇక హృతిక్‌ రోషన్‌ ఈ సినిమాలో రావణాసురుడి పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్‌ వచ్చే సంవత్సరం ప్రారంభం కానుంది.

ABOUT THE AUTHOR

...view details