తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Sai Pallavi: సాయి పల్లవి బర్త్‌డే సర్‌ప్రైజ్‌లు చూశారా.. - sai pallavi birthday wishes

సాయిపల్లవి పుట్టిన రోజును పురస్కరించుకొని.. ఆమె నటిస్తున్న చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్​ అందిచాయి ఆయా నిర్మాణ సంస్థలు.

Sai Pallavi
పల్లవి

By

Published : May 9, 2022, 10:31 PM IST

Updated : May 9, 2022, 10:53 PM IST

రానా దగ్గుబాటి సరసన సాయి పల్లవి నటిస్తున్న చిత్రం 'విరాట పర్వం'. రానా కామ్రెడ్‌గా కనిపించనున్న ఈ సినిమాకు వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రబృందం 'సోల్‌ ఆఫ్‌ వెన్నెల' పేరుతో ఓ వీడియో విడుదల చేసింది. 'చరిత్రలో నిలిచిపోయే ప్రేమ తనది' అంటూ రానా ట్విటర్‌లో దానిని షేర్ చేశారు. అందులో 'నిర్బంధాలు కౌగిలించుకున్న వసంత కాలం మనది..' అంటూ సాయి పల్లవి చెప్పిన డైలాగ్‌ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. జులై 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను సురేశ్‌ ప్రొడక్షన్‌, ఎస్‌ఎల్‌వీ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

కాగా, సాయిపల్లవి ప్రధాన పాత్రలో నటిస్తున్న తన తదుపరి చిత్ర టైటిల్‌ను ప్రకటించారు. 'గార్గి' పేరుతో రాబోతున్న ఈ సినిమా గౌతమ్‌ రామచంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో ఈ సినిమా అలరించనుంది.

గార్గి

ఇదీ చదవండి:ప్రభాస్.. నన్ను చెడగొట్టినందుకు థ్యాంక్స్​: దిశా పటానీ

Last Updated : May 9, 2022, 10:53 PM IST

ABOUT THE AUTHOR

...view details