తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Sai Pallavi Marriage : సాయి పల్లవి పెళ్లిపై రూమర్స్‌.. ఆ డైరెక్టర్​ క్లారిటీ! - తమిళ దర్శకుడితో సాయి పల్లవి పెళ్లి

Sai Pallavi Marriage : నటి సాయిపల్లవి పెళ్లిపై తాజాగా నెట్టింట పలు వార్తలు హల్​చల్​ చేశాయి. ఆమె ఓ దర్శకుడితో ఉన్న ఫొటోను షేర్​ చేసి కొందరు నెటిజన్లు ఈ రూమర్స్​ను ట్రెండ్​ చేశారు. అయితే వీటిపై 'విరాటపర్వం' దర్శకుడు వేణు ఊడుగుల క్లారిటీ ఇచ్చారు.

Sai Pallavi Marriage
Sai Pallavi Marriage

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2023, 6:41 PM IST

Sai Pallavi Marriage : ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల పెళ్లిపై అనేక రూమర్స్​ సోషల్​ మీడియాలో హల్​ చల్​ చేస్తున్నాయి. ఇటీవలే కోలీవుడ్​ బ్యూటీ కీర్తి సురేశ్‌ పెళ్లంటూ రూమర్స్‌ తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో కీర్తి సురేశ్‌ తండ్రి సురేశ్‌ కుమార్‌ స్పందించి అవేవి నిజం కాదంటూ ఖండించారు. అయితే తాజాగా మరో నటిపై పెళ్లి రూమర్స్​ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్​ అవుతోంది. కోలీవుడ్​ నటి సాయి పల్లవికి తమిళ దర్శకుడికి వివాహం అంటూ కొందరు నెటిజన్లు ప్రచారం చేయడం ప్రారంభించారు. అయితే, ఆ వార్తలో ఎటువంటి వాస్తవం లేదని క్లారిటీ వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే ?

ఆ ఒక్క ఫొటో వల్ల..
Sai Pallavi SK 21 Movie :తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్‌తో కలిసి సాయి పల్లవి 'SK21' అనే సినిమాలో కనిపించనున్నారు. దీనికి రాజ్‌కుమార్‌ పెరియస్వామి దర్శకత్వం వహించనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం గ్రాండ్​గా జరిగింది. అందులో భాగంగా చిత్రబృందంతో పాటు సాయిపల్లవి, దర్శకుడు కూడా మెడలో దండలు వేసుకుని ఫొటోలు దిగారు. అయితే ఈ ఫొటోను కొందరు నెటిజన్లు సగం వరకు క్రాప్​ చేసి.. ఆమె పెళ్లి అంటూ నెట్టింట రూమర్స్‌ సృష్టించారు. దీంతో ఓవర్​నైట్​లో ఈ విషయం సోషల్​ మీడియాలో తెగ ట్రెండ్​ అయ్యింది. అయితే ఇదే విషయంపై 'విరాటపర్వం' దర్శకుడు వేణు ఊడుగుల తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఆ ఫొటోను సినిమా ప్రారంభం సందర్భంగా తీయించుకున్నట్లు తెలుపుతూ ఓ పోస్ట్​ను తన సోషల్ మీడియాలో షేర్​ చేశారు. దీంతో సాయి పల్లవి ఫ్యాన్స్​ ఊపిరి పీల్చుకున్నారు. ఇటువంటి ఫేక్​ న్యూస్​ను ట్రెండ్​ చేసేవాళ్ల పని పట్టాలంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.

గతంలో కీర్తి సురేశ్​ కూడా ఇటువంటి రూమర్స్​ను చాలా సార్లు ఎదుర్కొన్నారు. మ్యూజిక్​ డైరెక్టర్​ అనిరుధ్​తో ఆమె ఉన్నారని త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోనున్నట్లు కొన్నాళ్ల క్రితమే పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు, నెట్టింట పోస్ట్‌లు తెగ ట్రెండ్​ అయ్యాయి. ఇక దానిపై కీర్తి కూడా స్పదించారు. " నా పెళ్లి గురించి వస్తోన్న వార్తలు, పోస్ట్‌లు చూసి నేను షాకయ్యాను. కొంతమంది నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా ఇప్పటికే, మూడు, నాలుగు సార్లు నాకు పెళ్లి చేసేశారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా వివాహం చేసుకుంటాను" అని క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా తన స్నేహితుడితో కలిసి దిగిన ఫొటోను కీర్తి సురేశ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. 'కీర్తికి కాబోయే వరుడు ఇతడే' అంటూ మరో సారి ఆ ఫొటోను ట్రెండ్ చేశారు. దీంతో విస్తుపోయిన కీర్తి కుటుంబ సభ్యులు నెట్టింట పలు మార్లు క్లారిటీ ఇచ్చిన సందర్భాలున్నాయి.

Sai Pallavi Bollywood Movie : ఆ స్టార్ హీరో కొడుకుతో సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ.. షూటింగ్ కూడా షురూ అయిందట!

Keerthy Suresh Marriage : ఆ మ్యూజిక్​ డైరెక్టర్​తో కీర్తి సురేశ్​ పెళ్లి.. నటి తండ్రి క్లారిటీ

ABOUT THE AUTHOR

...view details