తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

క్షమాపణలు చెప్పిన సాయిపల్లవి.. వాళ్లకు మాత్రం కృతజ్ఞతలంటా!

Sai pallavi: తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ.. నటి సాయిపల్లవి ఓ వీడియో విడుదల చేసింది. తన మాటల వల్ల ఎవరైనా ఇబ్బందిపడి ఉంటే క్షమించమని కోరారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లోనూ తనకి సపోర్ట్‌ చేసిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు.

Sai pallavi explanation on controversial comments on  Religious conflicts
Sai pallavi explanation on controversial comments on Religious conflicts

By

Published : Jun 19, 2022, 2:57 AM IST

Updated : Jun 19, 2022, 7:21 AM IST

క్షమాపణలు చెప్పిన సాయిపల్లవి.. వాళ్లకు మాత్రం కృతజ్ఞతలంటా!

Sai pallavi: గత కొన్నిరోజుల నుంచి తనపై జరుగుతున్న ప్రచారంపై నటి సాయిపల్లవి వివరణ ఇచ్చారు. ఈమేరకు తాజాగా ఆమె ఓ వీడియో ఫైల్‌ని షేర్‌ చేశారు. 'విరాటపర్వం' ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కశ్మీర్ పండిట్స్, గోహత్యలపై వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలపై భజరంగ్ దళ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాను చెప్పిన విషయాలను పూర్తిగా పరిగణలోకి తీసుకోకుండా కేవలం కొన్ని మాటల్ని మాత్రమే తీసుకుని కొంతమంది ఇలాంటి వార్తలు సృష్టించారని ఆమె అన్నారు. తన మాటల వల్ల ఎవరైనా ఇబ్బందిపడి ఉంటే క్షమించమని కోరారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లోనూ తనకి సపోర్ట్‌ చేసిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు.

"గత కొన్నిరోజుల నుంచి నాపై వస్తోన్న విమర్శలు.. నా వ్యాఖ్యలను తప్పుదోవ పట్టిస్తూ జరుగుతున్న ప్రచారానికి సంబంధించి స్పష్టత ఇచ్చేందుకే మీ ముందుకువచ్చాను. ఇప్పుడు నా అభిప్రాయాన్ని చెప్పడానికి కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే నా మాటల వల్ల ఎవరూ ఇబ్బందిపడకూడదు. ఒకవేళ నా మాటలతో మిమ్మల్ని ఇబ్బందిపెట్టి ఉంటే క్షమించండి. ఇటీవల నేనిచ్చిన ఓ ఇంటర్వ్యూలో మీరు లెఫ్ట్‌ వింగ్‌కి మద్దతిస్తారా? రైట్‌ వింగ్‌కి మద్దతిస్తారా? అని అడిగారు. దానికి నేను వారికి, వీరికి అని కాకుండా ముందు మనం మంచి మనుషులుగా జీవించాలనే ఉద్దేశంతో సమాధానం చెప్పాను. కానీ, నా మాటల్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుని ఏవేవో ప్రచారం చేశారు. నా దృష్టిలో హింస అనేది ముమ్మాటికీ తప్పే. ఒక డాక్టర్‌గా ప్రాణం విలువ నాకు తెలుసు. ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ నాకు సపోర్ట్‌గా ఉన్న వాళ్లందరికీ నా కృతజ్ఞతలు" -సాయిపల్లవి, నటి

ఇవీ చూడండి:

Last Updated : Jun 19, 2022, 7:21 AM IST

ABOUT THE AUTHOR

...view details