సుప్రీమ్ స్టార్ సాయిధరమ్ తేజ్.. 'విరూపాక్ష' సినిమాతో చాలా కాలం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్, ఫాంటసీ ఇలాంటి అన్ని అంశాలను కలగలిపిన ఈ సినిమాలో లీడ్ రోల్ చేశాడు. 'చిత్రలహరి', 'సోలో బ్రతుకే సో బెటర్', 'ప్రతి రోజు పండగే' లాంటి సినిమాలతో మంచి టాక్ సంపాదించుకున్న తేజ్.. 'రిపబ్లిక్' సినిమాతో కొంచం వెనక్కి తగ్గాడు. రోడ్డు ప్రమాదం వల్ల సినిమాలకు కొంతకాలం దూరమైన ఈ స్టార్ ఇప్పుడు విరూపాక్షతో తన ట్యాలెంట్‌ను చూపించేందుకు ముందుకొచ్చాడు.
విరూపాక్ష చిత్రంలో సాయి ధరమ్ తేజ్‌కు జోడీగా సంయుక్త నటించింది. ఈ సినిమాతో కార్తీక్ వర్మ దండు మరోసారి మెగాఫోన్ పట్టుకున్నారు. సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. ఏప్రిల్ 21న ఈ సినిమాను ఇండియాతో పాటు ఓవర్సీస్‌లోనూ రిలీజ్ చేశారు.
అయితే ఇప్పటికే ప్రీమియర్ షోలు చూసిన అభిమానుల నుంచి ఈ సినిమా గురించి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. కార్తీక్ ఈ సినిమాను చాలా బాగా చిత్రీకరించారని.. ప్రేక్షకులు ఈ సినిమాకు ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఉందని అంటున్నారు. స్టోరీ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉందట. సుకుమార్.. తన స్క్రీన్ ప్లేతో తెరపై మ్యాజిక్ చేశారని అంటున్నారు. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అంశాలు ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయని టాక్. 'కాంతార' ఫేమ్ అజనీశ్ లోక్‌నాథ్ సమకూర్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు హైలైట్‌గా ఉందట. ప్రీ ఇంటర్వెల్‌లో మాత్రం చిల్ అయ్యే సన్నివేశాలు ఉన్నాయని టాక్. సెకండ్ హాఫ్ పై మరింత ఆసక్తి కలిగేలా ఇంటర్వెల్‌ను సెట్ చేశారట.