Sai Dharam Tej Emotional Post : పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషించిన 'బ్రో' మూవీ శుక్రవారం థియేటర్లలో విడుదలై సందడి చేస్తోంది. వినోదాయ సిత్తం అనే తమిళ సినిమాకు రీమేక్‌గా రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ సందర్భంగా సుప్రీం హీరో సాయి ధరమ్‌తేజ్ సోషల్ మీడియా వేదికగా ఓ ఏమోషనల్ పోస్ట్ చేశారు. పవన్ కల్యాణ్‌తో తాను చిన్నప్పుడు తీసుకున్న ఓ ఫొటోను షేర్ చేసిన ఆయన.. 'అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి!' అనే క్యాప్షన్‌ను ఆ ఫొటోకు జత చేశారు. తన మామయ్య పవన్ కల్యాణ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందంటూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
"ప్రస్తుతం నాలో ఉన్న ప్రతి ఎమెషన్‌కు అక్షర రూపం ఇవ్వాలని ఉంది. నా గురువు, నా మామయ్య, నా స్ఫూర్తి.. పవన్‌కల్యాణ్‌తో కలిసి స్క్రీన్ పంచుకునే అదృష్టం నాకు దక్కింది. నేను ఇప్పటికీ ఆయన చేయి పట్టుకున్న చిన్నపిల్లాడినే. నాపై ఎనలేని నమ్మకం ఉంచి ఇంత గొప్ప సినిమాకు నన్ను ఎంపిక చేసిన తివిక్రమ్‌కు నా ధన్యవాదాలు. మీ వల్లే నా ఈ కల నిజమైంది. అలాగే సముద్ర ఖని, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, 'బ్రో' మూవీ టీమ్‌లో అందరికీ నా కృతజ్ఞతలు. ముఖ్యంగా నా ముగ్గురు మామయ్యలకు వారి అభిమానులకు, సినీ ప్రియులకు అందరికీ థ్యాంక్స్. మీరు చూపించే ఈ ప్రేమాభిమానాలను నేను ఎప్పటికీ మర్చిపోను. ఈ సినిమా మనందరిదీ. దీని చూసి మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అంటూ తనని ఆదరిస్తున్న ప్రేక్షకులకు తేజ్ సోషల్ మీడియా ద్వారా స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు.