సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా రాబోతోంది. SDT16 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా శుక్రవారం పూజ కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమాతో కొత్త దర్శకుడు జయంత్ పానుగంటి పరిచయం అవుతున్నారు. బాపినీడు సమర్పణలో.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎన్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభమౌతుందని చిత్ర నిర్మాణ సంస్ధ ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్, ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను చిత్ర బృందం త్వరలోనే తెలియజేసే అవకాశాలున్నాయి.
సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా ప్రారంభం ఓటీటీలోకి 'రామ్‌సేతు'..
అక్షయ్‌కుమార్ కీలక పాత్రలో నటించిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ రామ్‌సేతు. అక్టోబరు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిసెంబరు 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా చూడాలంటే అద్దె ప్రాతిపదికన రూ.199 చెల్లించి చూడాలి. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఆడియోను ఎంపిక చేసుకోవచ్చు. ఇక ఎలాంటి అద్దె చెల్లించకుండా ఎప్పటి నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకొస్తారో వేచి చూడాల్సి ఉంది. బహుశా రెండు వారాల తర్వాత రామ్‌సేతును ప్రైమ్ చందాదారులందరూ చూడవచ్చు. అభిషేక్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్, జాక్వెలైన్, నుస్రత్‌లు నటించారు.
అల్లు శిరీష్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ వచ్చేస్తోంది..
యంగ్ హీరో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన సినిమా ఊర్వశివో రాక్షసివో. రాకేశ్ శశి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చి యువతను బాగా ఆకట్టుకుంది. డిసెంబర్ 9 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రీమియర్ కానుంది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ప్రకటించారు. థియేటర్లో చూడలేకపోయిన వారు ఈనెల 9 నుంచి ఆహాలో చూసేయచ్చు. ధీరజ్ మొగిలినేని, తమ్మారెడ్డి భరద్వాజ, విజయ్.ఎం నిర్మించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సునీల్, పృథ్వీ, ఆమని, కేదార్ శంకర్, పోసాని కృష్ణమురళి, తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.
కథ ఇదే..
శ్రీకుమార్ (అల్లు శిరీష్) మధ్య తరగతి కుటుంబానికి చెందిన కుర్రాడు. సింధూజ (అను ఇమ్మాన్యుయేల్) అమెరికాలో పనిచేసి భారత్‌కు తిరిగొచ్చిన అమ్మాయి. ఇద్దరూ ఒకే సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తుంటారు. సింధూని చూసి మనసు పారేసుకుంటాడు శ్రీకుమార్. ఆధునిక భావాలున్న ఆమె కూడా తక్కువ సమయంలోనే అతడికి దగ్గరవుతుంది. ఇద్దరూ శారీరకంగా ఒక్కటయ్యాక శ్రీ తన ప్రేమని వ్యక్తం చేస్తాడు. ఆమె మాత్రం ప్రేమించడం లేదని చెబుతుంది. మరి మనసులో ప్రేమ లేకుండానే శ్రీకి సింధు ఎలా దగ్గరైంది? ఇద్దరూ కలిసి సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఏం చేశారు? వారిద్దరికీ పెళ్లైందా? లేదా? తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే.