తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అప్పటి నుంచి సుధీర్​కు అన్నీ వింతలేనట.. అదరగొడుతున్న 'అరబిక్​ కుత్తు' ​ - calling sahasra

సినిమా తాజా అప్డేట్స్​ వచ్చేశాయి. సుడిగాలి సుధీర్‌ హీరోగా నటించిన కాలింగ్‌ సహస్ర సినిమా టీజర్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్​ విడుదల చేశారు. దళపతి విజయ్ నటించిన బీస్ట్ సినిమాలోని 'అరబిక్​ కుత్తు' లిరికల్‌ వీడియో 250 మినియన్ల వ్యూస్​ను కొల్లగొట్టింది.

movie updates
మూవీ అప్డేట్స్​

By

Published : Apr 1, 2022, 5:03 PM IST

Updated : Apr 1, 2022, 11:03 PM IST

'ఆ సిమ్‌ తీసుకున్నప్పటి నుంచి నా జీవితంలో అన్నీ వింత సంఘటనలే చోటుచేసుకుంటున్నాయి' అని అంటున్నారు నటుడు సుడిగాలి సుధీర్‌. కమెడియన్‌గా బుల్లితెరపై మంచి సక్సెస్‌ని సొంతం చేసుకున్న ఆయన హీరోగా విజయం సాధించేందుకు ఎంతో శ్రమిస్తున్నారు. ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’, ‘3 మంకీస్‌’తో మిశ్రమ స్పందనలు చవి చూసిన సుధీర్‌ నటిస్తున్న సరికొత్త చిత్రం 'కాలింగ్‌ సహస్ర'. అరుణ్‌ వక్కిరాల దర్శకత్వం వహించిన ఈసినిమా టీజర్‌ను శుక్రవారం ఉదయం చిత్రబృందం విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 'బతకడం కోసం చంపడం సృష్టి ధర్మం. మరి, చంపడం తప్పు కానప్పుడు దాన్ని చూపించడం తప్పేలా అవుతుంది' అనే డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమైంది. ఇందులోని ప్రతి సన్నివేశం ఉత్కంఠకు గురి చేసేలా సాగింది. డాలీషా, స్పందన పల్లి, శివబాలాజీ కీలకపాత్రలు పోషించారు. క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈసినిమా వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాలింగ్‌ సహస్ర టీజర్​ విడుదలకు హాజరైన అరవింద్​

250 మినియన్ల వీక్షణలు..

తమిళస్టార్​ దళపతి విజయ్.. బీస్ట్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకా రానున్నారు. అయితే వాలంటైన్స్‌డేను పురస్కరించుకొని బీస్ట్‌ సినిమాలోని 'అరబిక్​ కుత్తు' అనే పాట లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. ఈ పాట రికార్డుల వ్యూస్​తో దూసుకెళ్తోంది. ఇప్పటికే 250 మినియన్ల వీక్షణలు దాటింది. విడుదలైనప్పటి నుంచి ఈ సాంగ్​ ట్రెండింగ్​లోనే ఉంటోంది.

Last Updated : Apr 1, 2022, 11:03 PM IST

ABOUT THE AUTHOR

...view details