తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ధనుశ్​కు వీరాభిమాని అంటున్న హాలీవుడ్ డైరెక్టర్స్​.. మరో మూవీలోనూ ఛాన్స్​! - ధనుశ్​పై హాలీవుడ్ దర్శకులు ప్రశంసలు

Dhanush Hollywood movie: ధనుశ్​పై హాలీవుడ్ దర్శక ద్వయం రస్సో బ్రదర్స్‌ ప్రశంసలు కురిపించారు. తమ సినిమా 'ది గ్రేమ్యాన్'​లోని ధనుశ్​ పాత్ర గురించి వివరించారు. ఈ చిత్రం సూపర్​హిట్​ అయితే సీక్వెల్​ను రూపొందించి, అందులోనూ ఆయన పాత్రను కొనసాగిస్తామని చెప్పారు.

dhanush hollwood movie
ధనుశ్ హాలీవుడ్ చిత్రం

By

Published : May 25, 2022, 8:50 PM IST

తమిళ స్టార్​ హీరో ధనుశ్​పై ప్రశంసలు కురిపించారు హాలీవుడ్​ దర్శక ద్వయం రస్సో బ్రదర్స్‌. ఆయనకు వీరాభిమానులని అన్నారు. ధనుశ్​ నటించిన తాజా హాలీవుడ్ చిత్రం 'ది గ్రే మ్యాన్​'కు వీరే దర్శకత్వం వహించారు. ఈ సినిమా నెట్​ఫ్లిక్స్​లో జులై 22 నుంచి స్ట్రీమింగ్​ కానుంది. ఈ సందర్భంగా మే 14న ట్రైలర్​ను విడుదల చేశారు మేకర్స్​. ఇందులో ధనుశ్​ స్టైలిష్​ లుక్​ అదిరిపోయింది. కాగా, విడుదల తేదీ దగ్గర పడుతుండడం వల్ల ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ దర్శక ద్వయం.. ధనుశ్​ను ప్రశంసించారు. ఈ చిత్రాన్ని సినీప్రియులు ఆదరిస్తే 'ది గ్రే మ్యాన్​' సీక్వెల్ కూడా తెరకెక్కిస్తామని, అందులోనూ ధనుశ్​ ఉంటారని చెప్పారు.

"దర్శకుడు ఆంథోని, నేను ధనుశ్​కు పెద్ద అభిమానులం. ఈ చిత్రంలో పాత్రను కేవలం ఆయన కోసమే రాశాం. ఈ రోల్ స్పెషల్​గా ఉంటుంది. హీరోతో పోరాడే పాత్రలో ఆయన కనిపిస్తారు. అటు ఆధ్యాత్మికంగానూ కనిపిస్తారు. ఇది సినిమాను మరింత పవర్​ఫుల్​గా చూపిస్తుంది. ధనుశ్​పై రెండు బడా యాక్షన్​ ఫైట్స్​ను చిత్రీకరించాం. మొత్తంగా ఈ మూవీ సినీప్రియులకు నచ్చితే సీక్వెల్​ను రూపొందిస్తాం. ధనుశ్​ పాత్రను కంటిన్యూ చేస్తాం" అని జో రస్సో అన్నారు.

ఇదీ చూడండి:లైఫ్​లో కాంప్రమైజ్​ అవ్వన్నంటున్న చైతూ.. 'డెడ్​' అంటూ సామ్ పోస్ట్​

ABOUT THE AUTHOR

...view details