తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రామ్​చరణ్- శంకర్ సినిమా టైటిల్​ అదేనా? - రామ్​చరణ్​ సినిమాలు

రామ్​చరణ్- శంకర్​ సినిమా టైటిల్​ ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. సినిమా కోసం మూడు టైటిల్స్​ను పరిశీలించగా.. అందులో ఒకటి ఎంపిక చేసినట్లు సమాచారం. ఆ టైటిల్​ ఏంటంటే?

Will the title of Charan-Shankar movie be decided?
చరణ్- శంకర్ సినిమా టైటిల్​ అదేనా?

By

Published : May 27, 2022, 7:05 AM IST

మెగా హీరో రామ్​చరణ్- దర్శకుడు శంకర్ కాంబినేషన్​లో వస్తున్న సినిమాపై ఆసక్తికర వార్త ఒకటి సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాపై పేరును ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్​తో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు 'అధికారి' అనే టైటిల్​ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. టైటిల్ పవర్​ఫుల్​గా ఉండటంతో ప్రచారంలో ఉన్న 'అధికారి' పేరే ఖాయమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్​ శరవేగంగా జరుగుతోంది. జూన్​ 2 నుంచి కొత్త షెడ్యూల్​ను మొదలెట్టనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో చరణ్ సరసన నాయికగా కియారా అడ్వాణీ నటిస్తోంది.

చెన్నైకు విజయ్‌..:విజయ్‌ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. దిల్‌రాజు, శిరీష్‌, పరమ్‌ వి పొట్లూరి, పెరల్‌ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక కథానాయిక. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. తాజాగా 25రోజుల పాటు చిత్రీకరించిన భారీ షెడ్యూల్‌ పూర్తయింది. ఇందులో భాగంగా చిత్ర ప్రధాన తారాగణంపై చాలా కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించారు. ఈ విషయాల్ని చిత్ర బృందం గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు విజయ్‌, వంశీ కలిసి ఉన్న సెట్లోని ఫొటోను నెట్టింట పంచుకున్నారు. విజయ్‌ నటిస్తున్న 66వ చిత్రమిది. తదుపరి షెడ్యూల్‌ చెన్నైలో జూన్‌ తొలివారంలో మొదలు కానున్నట్లు సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో శరత్‌ కుమార్‌, ప్రభు, యోగిబాబు, ప్రకాష్‌ రాజ్‌, శ్రీకాంత్‌, జయసుధ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇదీ చదవండి:ప్రేయసితో 'జబర్దస్త్​' కిర్రాక్​ ఆర్పీ నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్​

ABOUT THE AUTHOR

...view details