తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచిలర్​.. అమ్మాయి ఎవరంటే ? - శర్వానంద్ సినిమాలు

టాలీవుడ్​లోని మరో మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచిలర్​ శర్వానంద్ గురించి ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇన్నాళ్లు సింగిల్​గా ఉన్న ఈ స్టార్​ హీరో త్వరలో ఓ ఇంటివాడు అవ్వబోతున్నారట.

actor sharwananad getting married soon
actor sharwananad

By

Published : Jan 5, 2023, 12:04 PM IST

టాలీవుడ్​లోని మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచిలర్స్​ అంతా ఒక్కొక్కరిగా ఓ ఇంటివారు అవుతున్నారు. 2022లో ఆది పినిశెట్టి, నాగ శౌర్య లాంటి వారు తమ ప్రియమైన వారిని మనువాడగా.. ఇప్పుడు వారి కోవలోకి మరో స్టార్​ రానున్నారట. అది కూడా ది మోస్ట్​ అవెయిటడ్​ స్టార్ బ్యాచిలర్​​. ఆయనెవరో కాదు మన శర్వానంద్​. అవును ఇది నిజమేనని సినీ వ‌ర్గాల టాక్​. సోషల్​ మీడియాలో వైరలవుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే హీరో శ‌ర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నారని.. ఆమె తెలంగాణకు చెందిన సాఫ్ట్​వేర్​ యువతి అని టాక్​.

అమెరికాలో జాబ్​ చేస్తున్న ఈమె ప్రస్తుతం కొవిడ్​ కారణంగా హైదరాబాద్​లోనే వర్క్​ ఫ్రమ్​ హోమ్​ చేస్తున్నారట. మరో సమాచారం ఏంటంటే.. వీరిద్దరు గతకొంత కాలంగా ప్రేమలో ఉన్నారని వీరి గురించి ఇంట్లో చెప్పి శర్వానంద్​ తన పెళ్లికి లైన్ క్లియ‌ర్ చేసుకున్నార‌ట. అయితే ఈ విషయాన్ని శర్వానంద్​ ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. దీంతో ఇవి రూమార్స్​ అని కొందరు కొట్టి పారేస్తున్నప్పటికీ తమ అభిమాన హీరో ఓ ఇంటి వాడు అవుతున్నాడు అన్న ఊహ ఎంత బాగుందని ఫ్యాన్స్​ సంబరపడిపోతున్నారు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. 2022లో శ‌ర్వానంద్ మూడు సినిమాల్లో మెరిశారు. 'మ‌హా స‌ముద్రం','ఆడ‌వాళ్లు మీకు జోహార్లు' సినిమాలు బాక్సాఫీస్​ వద్ద నిరాశపరచగా..'ఒకే ఒక జీవితం' మాత్రం స‌క్సెస్ సాధించింది.

ABOUT THE AUTHOR

...view details