Rules Ranjan Release :సెప్టెంబర్ 28న 'సలార్' రిలీజ్ కన్ఫార్మ్ అన్న సమయంలో కొన్ని చిన్న సినిమాలు వెనక్కితగ్గి తమ విడుదల తేదీలను మార్చుకున్నాయి. అయితే తాజాగా 'సలార్' పోస్ట్‌పోన్ అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో రిలీజ్‌ను వాయిదా వేసుకున్న చిన్న సినిమాలన్నీ 28వ తేదీని లాక్ చేసుకున్నాయి. అయితే.. తాజాగా వాటిలో రెండు సినిమాలు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'రూల్స్ రంజన్'. రత్నం కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. అయితే.. ఇప్పుడు ఆ సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదల చేసిన ఓ పోస్టర్లో అక్టోబర్ 6 రిలీజ్ డేట్ అని రాసుంది.
మరోవైపు ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్ మెయిన్ రోల్స్‌లో వచ్చిన 'మ్యాడ్' సినిమా కూడా కూడా సెప్టెంబర్28న రావాల్సింది. అయితే అది కూడా ఆ రోజు విడుదల కావడం లేదని తెలుస్తోంది. మొదట సెప్టెంబర్ 1న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ ఆ డేట్‌ను మారుస్తూ.. ఈ నెల 28న విడుదల చేస్తామంటూ ఖరారు చేశారు. కానీ తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో విడుదల తేదీ లేకపోవడం వల్ల కొందరు నెటిజన్లు ఈ చిత్రం కూడా వాయిదా పడిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.