Rules Ranjan Movie Release Date : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి తెలిసిందే. గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్న ఈ యువ కథనాయకుడు.. ఇప్పటికే ఈ ఏడాది 'వినరో భాగ్యము విష్ణు కథ', 'మీటర్'.. రెండు చిత్రాలతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. అయితే ఇప్పుడాయన 'రూల్స్ రంజన్' అనే చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించారు మేకర్స్. సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో క్లాసీ లుక్లో నేహా, కిరణ్ ఆకట్టుకున్నారు.
Salaar Release Date : అయితే సెప్టెంబర్ 28వ తేదీన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైరన్ 'సలార్' విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ సమయంలో రిలీజ్ చేసేందుకు ఇతర ఈ మూవీటీమ్ సాహసం చేయలేదు. ఇప్పుడు రెండు మూడు రోజులుగా 'సలార్' సినిమా వాయిదా పడుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. మరి ఇప్పుడు అదే తేదీన రూల్స్ రంజన్ విడుదలకు రెడీ అవ్వడంతో సలార్ సినిమా వాయిదా(salaar postpone news) పడినట్లే అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇకపోతే రూల్స్ రంజన్ సినిమాలో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించారు. ఈ చిత్రానికి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు అమ్రిష్ గణేష్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన అప్డేట్స్ కూడా సినిమాపై మంచి ఆసక్తినే రేకెత్తించాయి.