దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఓటీటీలో రిలీజ్ కానున్న నేపథ్యంలో కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా జీ5లో ఈనెల 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తొలుత పే ఫర్ వ్యూ పద్ధతిలో సినిమాను విడుదల చేయాలని భావించారు. అయితే.. ప్రేక్షకులతో పాటు.. జీ5 సబ్స్క్రైబర్ల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడం వల్ల జీ5లో వెనక్కి తగ్గింది. 'పే ఫర్ వ్యూ' పద్ధతి లేకుండా.. జీ5 సబ్స్క్రైబర్లు ఉచితంగానే సినిమా చూడవచ్చని ప్రకటించింది. అయితే సబ్స్క్రిప్షన్ లేనివాళ్లు కచ్చితంగా ప్రీమియం చెల్లించి చూడాల్సి ఉంటుందని వెల్లడించింది.
డబ్బులు చెల్లించనక్కర్లేదు.. ఓటీటీలో ఫ్రీగానే ఆర్ఆర్ఆర్
'ఆర్ఆర్ఆర్' సినిమా ఈ నెల 20 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఓటీటీ సంస్థ జీ5 కీలక ప్రకటన చేసింది. 'పే ఫర్ వ్యూ' పద్ధతి లేకుండా.. జీ5 సబ్స్క్రైబర్లు ఉచితంగానే సినిమా చూడవచ్చని ప్రకటించింది.
తొలుత అదనపు ప్రీమియం రూ. 100 చెల్లించి సినిమాను చూడాల్సి ఉంటుందని జీ5 చెప్పింది. ఈ క్రమంలో ప్రజల నుంచి.. ప్రధానంగా సబ్స్క్రైబర్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. సినిమాకు విడుదలకు ముందు ఆయా ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకుని టికెట్ల రెట్లు పెంచుకొని.. ఇప్పుడు ఓటీటీలో కూడా డబ్బులు చెల్లించమనడం ఎంతవరకు సమంజసమని ప్రేక్షకులు మండిపడ్డారు. ఈ క్రమంలో జీ5కి అనేక వినతులు వచ్చినట్లు సమాచారం. దీంతో నిర్వాహకులపై తీవ్రమైన ఒత్తి రావడం వల్ల తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
ఇదీ చదవండి:వాహ్ తమన్నా: ఈ గ్లామర్ బండి.. స్వర్గం నుంచి వచ్చినట్టుంది!
TAGGED:
rrr