తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'పార్టీ లేదా పుష్ప' బన్నీకి తారక్​ విషెస్​.. 'వస్తున్నా' అంటూ రిప్ల్లై - జూనియర్​ ఎన్టీఆర్​ అప్డేట్స్

అల్లు అర్జున్‌ బర్త్​డే సందర్భంగా యంగ్ టైగర్ ఆయనకు ట్విట్టర్​ వేదికగా విషెస్ చెప్పారు. అయితే ప్రస్తుతం ఈ ట్వీట్​ సోషల్​ మీడియాలో తెగ ట్రెండ్​ అవుతోంది. ఇంతకీ తారక్​ ఏం రాశారంటే..

jr ntr birthday wishes to allu arjun
jr ntr birthday wishes to allu arjun

By

Published : Apr 9, 2023, 7:26 AM IST

Updated : Apr 9, 2023, 9:28 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ శనివారం 41 ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలందరూ​ ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్​డే విషెస్ తెలిపారు.​ అభిమానులు సైతం జోరుగా సంబరాలు చేశారు. ఇక సినీ ప్రముఖులు కుడా తమదైన శైలిలో బన్నీకి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇప్పుడు ఓ స్టార్​ హీరో చేసిన ట్వీట్​ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్​ చల్​ చేస్తోంది. ఆ ట్వీట్​ చూసిన ప్రతి ఒక్కరు ఆయన టైమింగ్​కు తెగ మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఆయనెవరో కాదు మన 'ఆర్​ఆర్ఆర్'​ స్టార్ జూనియర్​ ఎన్టీఆర్​.

శనివారం ట్విట్టర్​ వేదికగా బన్నీకి విష్​ చేశారు తారక్​. "హ్యాపీ బ‌ర్త్ డే అల్లు అర్జున్ బావా.. ఇలాంటి వేడుకలు నువ్వు ఘనంగా జరుపుకోవాలి" అంటూ ట్వీట్ చేశారు. ఇక ఎన్టీఆర్​ ట్వీట్​కు రిప్లై ఇచ్చిన బన్నీ"థాంక్యూ ఫర్​ యువ‌ర్ లవ్లీ విషెష్ బావా.. వార్మ్ హ‌గ్స్" అంటూ రిప్లై ఇచ్చారు. ఇక మన తారక్​ దానికి ఓ అదిరిపోయే ట్వీట్​తో రిప్లై ఇచ్చారు. "ఓన్లీ హ‌గ్సేనా.. పార్టీ లేదా పుష్ప అంటూ.. న‌వ్వుతున్న ఎమోజీని ట్వీట్ చేశారు. దానికి బన్నీ కూడా 'వస్తున్నా' అంటూ తనదైన స్టైల్​లో రిప్లై ఇచ్చారు. ఇక ఈ ట్వీట్​ చాట్ సోషల్​ మీడియా​లో ట్రెండ్​ అవుతోంది. అంతే కాకుండా అటు బన్నీ ఫ్యాన్స్​.. ఇటు తారక్​ అభిమానులు ఫుల్​ దిల్​ ఖుష్​ అవుతున్నారు.

ఇక ఈ ఇద్దరు స్టార్​ హీరోల సినిమా అప్డేట్స్​ విషయానికి వస్తే.. అల్లు అర్జున్​ ప్రస్తుతం పుష్ప సినిమా సీక్వెల్ షూటింగ్​లో బిజీగా ఉన్నారు. ఆయన బర్త్​డే సందర్భంగా రిలీజ్ చేసిన ఓ పోస్టర్​ ప్రస్తుతం ట్రెండింగ్​లో ఉంది. ఇక అదే రోజు రిలీజ్​ చేసిన ఓ వీడియో గురించే ఇప్పుడు అందరు చర్చించుకుంటున్నారు. ఈ సినిమా షూటింగ్​ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. పుష్ప సినిమాతో పాన్​ ఇండియా స్టార్​గా ఎదిగిన అల్లు అర్జున్​ ఈ సీక్వెల్​తోనూ అదరగొట్టి మరోసారి బాక్సాఫీస్​ను షేక్​ చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

మరో వైపు జూనియర్​ ఎన్టీఆర్​ కూడా వరుస ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు. రీసెంట్​గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'NTR30' చిత్రీకరణలో పాల్గొన్నారు. మరోవైపు కేజీఎఫ్​ డైరెక్టర్​ ప్రశాంత్​ నీల్​తో ఓ సినిమాకు సైన్​ చేశారు. సలార్​ తర్వాత ఈ సినిమా సెట్స్​పైకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయని సినీ వర్గా టాక్​. అంతే కాకుండా తారక్​.. త్వరలోనే ఓ స్టార్ హీరో సినిమాతో బాలీవుడ్​లో తెరంగేట్రం చేయనున్నారు.

Last Updated : Apr 9, 2023, 9:28 AM IST

ABOUT THE AUTHOR

...view details