తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అమెరికాలో RRR రీరిలీజ్​.. థియేటర్​ హౌస్​ఫుల్​.. నెక్స్ట్​ షో కోసం క్యూలో ప్రజలు! - ఆర్​ఆర్​ఆర్​ లాస్​ ఏంజలెస్​

అమెరికాలోని ఓ థియేటర్​లో ఆర్ఆర్​ఆర్ చిత్రాన్ని రీరిలీజ్​ చేశారు. 1647 సీట్లు కలిగిన ఆ థియేటర్‌లో టికెట్స్‌ అన్నీ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోగా.. తర్వాత షో కోసం వందల మంది ప్రేక్షకులు సినిమా హాలు బయట బారులు తీరారు. అంతే కాకుండా ఆ సినిమాలోని నాటు నాటు సాంగ్​కు ప్రేక్షకులు చిందులేశారు.

RRR souring high as 1647-seater venue sold out in Los Angeles on 342nd day of RRR movie release
RRR souring high as 1647-seater venue sold out in Los Angeles on 342nd day of RRR movie release

By

Published : Mar 2, 2023, 7:40 PM IST

Updated : Mar 2, 2023, 7:47 PM IST

దర్శకధీరుడు ఎస్ఎస్​ రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. ఆస్కార్‌ బరిలో నిలిచిన ఈ చిత్రాన్ని మరింత ప్రమోట్‌ చెయ్యడం కోసం విదేశాల్లో ఇటీవలే ఈ సినిమాను రీ రిలీజ్‌ చేశారు. దీని కోసం ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రబృందం అమెరికా వెళ్లి థియేటర్లలో సందడి చేస్తోంది. అక్కడ ఈ సినిమా రీ రిలీజ్‌కు కూడా ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన వస్తోంది. థియేటర్లలో హౌస్‌ఫుల్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ అభిమానులు సినిమా టికెట్‌ల కోసం బారులు తీరుతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోలను చిత్రబృందం ట్విటర్‌లో పంచుకోగా అవి వైరల్‌గా మారాయి.

బారులు తీరిన ప్రజలు

అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో ఓ పెద్ద థియేటర్లో ఇటీవల ఈ సినిమాను రీ రిలీజ్‌ చేశారు. 1647 సీట్లు కలిగిన ఆ థియేటర్‌లో టికెట్స్‌ అన్నీ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. అంతే కాకుండా తర్వాత షో కోసం వందల మంది ప్రేక్షకులు సినిమా హాలు బయట బారులు తీరారు. ఆ సినిమాలోని నాటు నాటు సాంగ్​కు థియేటర్​లోని ప్రేక్షకులు చిందులేశారు. సినిమా ప్రదర్శన అనంతరం చిత్రబృందం ఆడియన్స్‌తో మాట్లాడి సందడి చేసింది.

కాగా, ఆస్కార్‌ బరిలో నిలిచిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా అవార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అవార్డుల్లో ఏకంగా ఐదు అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్‌గ్లోబ్‌ను కూడా సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ఆస్కార్‌ను కూడా గెలుచుకోవాలని సినీప్రియులు కోరుకుంటున్నారు.

అయితే మార్చి 12న జరగనున్న ఆస్కార్​ వేడుకలో నాటు నాటు పాట లైవ్​ ప్రదర్శన జరగనుంది. గాయకులు కాలభైరవ, రాహుల్​ సిప్లిగంజ్​ను ఈ పాటను ఆస్కార్​ వేదికపై ఆలపించనున్నారు. ఈ విషయాన్ని ఆస్కార్​ నిర్వాహకులు ఇటీవలే వెల్లడించారు. అది తెలుసుకున్న ఫ్యాన్స్​ చాలా ఖుషీ అవుతున్నారు. అదే సమయంలో ఆ సినిమా హీరోలు ఎన్టీఆర్​, రామ్​చరణ్​లు స్టెప్పులేయాలని కోరుకుంటున్నారు.

Last Updated : Mar 2, 2023, 7:47 PM IST

ABOUT THE AUTHOR

...view details