తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

చరణ్​ మంచి మనసు.. 'ఆర్ఆర్ఆర్​' టీమ్​ ఒక్కొక్కరికీ తులం బంగారం! - ramcharan gold coins

RRR Ramcharan Gifts Gold Coins: మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు మెగా పవర్​స్టార్ రామ్ చరణ్. 'ఆర్​ఆర్​ఆర్'​ ఘన విజయం సాధించిన సందర్భంగా.. సినిమాకు పనిచేసిన పలు విభాగాధిపతులకు బంగారు కానుకలను అందజేశారు.

Ramcharan gifted gold coins
RRR

By

Published : Apr 3, 2022, 8:36 PM IST

RRR Ramcharan Gifts Gold Coins: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్​చరణ్​, ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్'.. బాక్సాఫీసు వద్ద కనక వర్షం కురిపిస్తోంది. తొలిరోజే రూ.223 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ.. రూ.వెయ్యి కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది. ఈ సినిమాలో రామ్​చరణ్​ నటనను విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ మంచి మనసు చాటుకున్నారు చరణ్.

'ఆర్ఆర్ఆర్​' టీమ్​

సినిమా కోసం పని చేసిన వివిధ శాఖల హెచ్ఓడీలు, మేనేజర్లు, అకౌంటెంట్లు తదితరులను ఈ ఉదయం తన ఇంటికి పిలిపించారు చరణ్. వారందరికీ అల్పహారం పెట్టించి ఊహించని బహుమతులను అందించారు. తలా ఒక తులం (10 గ్రాముల) బంగారు నాణెం సహా స్వీట్ బాక్స్ కానుకగా ఇచ్చారు. సినిమా కోసం పని చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. 'ఆర్ఆర్ఆర్' ఇంత అద్భుతంగా రావడంలో వారి పాత్ర కూడా కీలకమేనని చరణ్ కొనియాడారు.

'ఆర్ఆర్ఆర్​' టీమ్​తో చెర్రీ

ఇదీ చదవండి:సమ్మర్​లో సినిమా జాతర.. వచ్చే 4 నెలల్లో రిలీజయ్యే చిత్రాలివే!

ABOUT THE AUTHOR

...view details