రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన రీసెంట్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. రామ్‌చరణ్, తారక్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్‌చరణ్, తారక్‌ల నటనకు సినీ ప్రియులందరూ ఫిదా అయ్యారు. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
RRR: అనుకున్న తేదీకి ముందే ఓటీటీలో ‘ఆర్‌ఆర్‌ఆర్’.. కానీ ఓ కండీషన్! - rrr latest updates
జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ జీ5, నెట్‌ఫ్లిక్స్‌లో మే 20 నుంచి అందుబాటులో ఉండనుందని సమాచారం. అయితే ఈ సినిమాను చూడాలంటే.. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ చిన్న మెలిక పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఓటీటీ రిలీజ్‌పై ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ జీ5, నెట్‌ఫ్లిక్స్ వేదికగా మే 20 నుంచి ఈ సినిమా అందుబాటులో ఉండనుందని సమాచారం. అయితే, ఇక్కడే ఒక చిన్న మెలిక కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మే 20వ తేదీన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చూడాలనుకుంటే సదరు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌కి సబ్‌స్క్రైబర్లు కొంత మొత్తంలో డబ్బు చెల్లించాలని వార్తలు వస్తున్నాయి. ఇక, జూన్ 3 నుంచి ఆయా స్ట్రీమింగ్ ప్లాట్‌పామ్స్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ యూజర్లందరికీ అందుబాటులో ఉండనుందని సమాచారం.
ఇదీ చదవండి:పవన్‌కల్యాణ్ ఫ్యాన్ కావడం వల్లే ఆదికి సినిమా అవకాశాలు తగ్గాయా?