RRR collections: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక సినిమా 'ఆర్ఆర్ఆర్'. మార్చి 25న విడుదలైన ఈ చిత్రం ఇంకా రికార్డులు సృష్టిస్తూనే ఉంది. వసూళ్ల ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది 'ఆర్ఆర్ఆర్'. ప్రపంచవ్యాప్తంగా రూ.1000కోట్ల గ్రాస్ సాధించి.. టాప్ గ్రాసర్ లిస్ట్‌లో మూడో స్థానాన్ని దక్కించుకుంది. భారత సినీ చరిత్రలో కలెక్షన్ల పరంగా 'ఆర్ఆర్ఆర్' కన్నా ముందు ఆమిర్ ఖాన్ 'దంగల్', ప్రభాస్ 'బాహుబలి 2' మాత్రమే ఉన్నాయి. 2016లో విడుదలైన 'దంగల్' రూ.2,024 కోట్లను వసూలు చేయగా.. 2017లో రిలీజ్ అయిన బాహుబలి కంక్లూజన్ రూ.1,810 కోట్లు అందుకుంది.
అమెరికాలో 'ఆర్ఆర్ఆర్' సరికొత్త రికార్డు.. వరల్డ్‌లో టాప్-3గా ఘనత! - ఆర్ఆర్ఆర్ వరల్డ్ వైడ్ కెలక్షన్స్ రికార్డు
RRR collections: రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఆర్ఆర్ఆర్' రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూనే ఉంది. ఓవర్సీస్లో దూసుకుపోతున్న ఈ చిత్రం తాజాగా అమెరికాలో సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా భారత సినిమాల టాప్ గ్రాసర్ లిస్ట్‌లో మూడో స్థానాన్ని దక్కించుకుంది.
అమెరికాలో ప్రభంజనం.. ఓవర్సీస్ బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తున్న 'ఆర్ఆర్ఆర్'.. మరో బెంచ్‌మార్క్‌ను సెట్ చేసే దిశగా దూసుకెళ్తోంది. యూఎస్ఏ మార్కెట్లో 13.3 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. భారత కరెన్సీ ప్రకారం రూ.100కోట్లుకు పైగానే. అంతకముందు 'బాహుబలి 2' అక్కడ ఇదే స్థాయిలో వసూళ్లను అందుకుంది. 113.79కోట్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ లెక్కల ప్రకారం 'ఆర్ఆర్ఆర్' హవా ఇంకా కొనసాగితే 'దంగల్' కలెక్షన్లను దాటలేకపోయినప్పటికీ.. 'బాహుబలి'ని మించే అవకశాముందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
ఇదీ చూడండి:ఫారెన్‌లో బన్నీ గ్రాండ్ పార్టీ.. రొమాంటిక్‌గా శౌర్య.. 'ఆర్ఆర్ఆర్' కలెక్షన్స్