RRR Golden Globe Award: 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదలైన దగ్గరి నుంచి ఎన్నో అవార్డులు, రివార్డులనూ సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం గోల్డెన్ గ్లోబ్ అవార్డ్-2023కి నామినేట్ అయింది. ఆంగ్లేతర భాషా చిత్రాల విభాగంలో ఉత్తమ చిత్రం, ఉత్తమ సంగీత దర్శకుడు విభాగాల్లో 'ఆర్ఆర్‌ఆర్' చిత్రం ఎంపికైంది.
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్‌కు 'RRR' నామినేట్.. ఎన్టీఆర్ ఏమన్నారంటే? - ఆర్‌ఆర్‌ఆర్ రాజమౌళి
'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్-2023కి నామినేట్ అయింది. ఆంగ్లేతర భాషా చిత్రాల విభాగంలో ఈ అవార్డుకు ఎంపికైంది. ఎన్టీఆర్ ఏమన్నారంటే?
ఇప్పటికే 'లాస్‌ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్' బెస్ట్ మ్యూజిక్ కేటగిరీలో కీరవాణి.. ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. అలాగే బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్లో కూడా కీరవాణి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విన్నర్‌గా అవార్డును గెలుచుకున్నారు. తాజాగా మరో అవార్డుకు 'ఆర్ఆర్‌ఆర్' చిత్రం నామినేట్ కావడం వల్ల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రం రెండు విభాగాల్లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్-2023కి ఎంపికవ్వడంపై నటుడు జూనియర్ ఎన్టీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు గాను చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.