RRR making video: ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌హిట్ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించిన ఈ చిత్రం ఇప్పుడు జీ5 ఓటీటీ వేదికగా సందడి చేస్తోంది. ఈ సందర్భంగా కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ ఎంత కష్టపడ్డాడో తెలియజేస్తూ దానికి సంబంధించిన మేకింగ్ వీడియోను జీ5 ట్వీట్ చేసింది.
'ఆర్‌ఆర్‌ఆర్'లోని ఈ సూపర్ సీన్స్ ఎలా తెరకెక్కించారంటే! - RRR world wide collections
RRR making video: 'ఆర్‌ఆర్‌ఆర్' ఇంటర్వెల్‌కి ముందు జంతువులతో కలిసి వ్యాన్‌లో నుంచి దూకే సీన్, రామ్‌చరణ్‌తో కలిసి ఫైట్ చేసే సీన్స్‌ను తారక్ వివరిస్తున్న వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక కొమురం భీముడో సాంగ్ మేకింగ్ వీడియోను జీ5 ట్వీట్ చేసింది. వాటిని చూసేయండి.
మరోవైపు.. ఈ సినిమా విడుదల సందర్భంగా ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి కలిసి ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. అదే విధంగా షూటింగ్ సందర్భంగా జరిగిన సంఘటనలను కూడా చర్చించుకున్నారు. అప్పుడు వారు మాట్లాడుకున్న విషయాలు సినిమా చూస్తే కానీ, చాలా మందికి అర్థం కాలేదు. హీరోలిద్దరితోనూ జక్కన్న ఏ సీన్ ఎలా తీశారన్న విషయాలను చెబుతూ ఎడిట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది. 'ఆర్‌ఆర్‌ఆర్' ఇంటర్వెల్‌కి ముందు జంతువులతో కలిసి ఎన్టీఆర్ వ్యాన్‌లో నుంచి దూకే సీన్, రామ్‌చరణ్‌తో కలిసి ఫైట్ చేసే సీన్ ఇలా ఒక్కోదాన్ని ఎలా చేశారో ఇందులో చూపించారు. ఎన్టీఆర్ కామెంట్రీకి తోడు ఆ సన్నివేశాలు కనిపిస్తుంటే మరింత సరదాగా ఉందా వీడియో.
ఇదీ చూడండి: '2.0' బడ్జెట్ రూ.500కోట్లు.. ఆర్‌ఆర్‌ఆర్ రూ. 400కోట్లు.. ప్రభాస్ 'ఆదిపురుష్' వ్యయం ఎంతంటే?