తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మహేశ్​ కోసం రాజమౌళి మాస్టర్​ ప్లాన్.. 'బాహుబలి'ని మించిపోయేలా..! - ఎస్​ఎస్​ఎంబీ 29 డైరెక్టర్​

సూపర్​ స్టార్​ మహేశ్,​ దిగ్గజ దర్శకుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'ఎస్​ఎస్​ఎంబీ 29'. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలు వార్తలు నెట్టింట జోరుగా ప్రచారం జరగుతున్న వేళ.. మరో అప్డేట్​ సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. అదేంటంటే...

rrr director ss rajamouli plans to make ssmb 29 into 3 parts
ss rajamouli ssmb 29

By

Published : Apr 11, 2023, 3:46 PM IST

'ఆర్​ఆర్​ఆర్'​ సినిమాతో తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు దర్శక ధీరుడు రాజమౌళి. ఈ సినిమాతో ఎన్నో సంచలనాలు సృష్టించిన ఈ స్టార్​ డైరెక్టర్​.. 'ఆస్కార్' అవార్డు గెలిచి ఔరా అనిపించారు. ఓ సాధారణ దర్శకుడిగా తన కెరీర్ ప్రారంభించిన ఆయన.. ఇప్పుడు ఇంటర్నేషనల్​ లెవెల్​లో గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో ఆయన సినిమాలపై సినీ లవర్స్​లో మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ఆయన తదుపరి ప్రాజెక్ట్​ ఎలా ఉండనుందో అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక 'ఆర్​ఆర్ఆర్​' తర్వాత ఆయన మహేశ్​ బాబుతో 'SSMB29' అనే సినిమా కోసం వర్క్​ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై పలు వార్తలు సోషల్​ మీడియాలో హల్​ చల్​ చేస్తున్న వేళ.. తాజాగా ఈ ట్రయాలజీ అప్డేట్​ సూపర్​ స్టార్​ ఫ్యాన్స్​ను ఆనందంలో ముంచెత్తుతోంది.

అదేంటంటే.. దర్శక ధీరుడు ఈ SSMB 29 సినిమాను ఏకంగా మూడు భాగాలుగా తెరకెక్కించే ప్లాన్​లో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. గతంలోనూ ఈ సినిమా 'బాహుబలి'లా రెండు భాగాలుగా తెరకెక్కనుంది అంటూ పలు వార్తలు వైరల్​ అయ్యాయి. అధికారిక ప్రకటన వస్తే ఈ విషయంపై క్లారిటీ వస్తుంది. ఈ సినిమాను మూడు భాగాల్లో తెరకెక్కిస్తే.. ఈజీగా పదేళ్లు పడుతుందని సినీ వర్గాల అంచనా. ఈ సినిమాలో పలువురు ఫేమస్​ స్టార్స్​తో పాటు హాలీవుడ్​కు చెందిన స్టార్స్​ కూడా నటించనున్నారనే టాక్​ నడుస్తోంది. ఇదంతా చూస్తుంటే.. గతంలో వచ్చిన రాజమౌళి సినిమాలకు మించి ఈ సినిమా ఉండనుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే, జేమ్స్ బాండ్‌, ఇండియానా జోన్స్ త‌ర‌హా యాక్ష‌న్ మూవీని మ‌హేశ్​తో చేయ‌డానికి రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం రాజమౌళి టీమ్.. మహేశ్​ బాబు సినిమా స్క్రిప్టు పనుల్లో బిజీ అయిపోయిందని సమాచారం.

ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాకు సైన్​ చేశాడు టాలీవుడ్​ సూపర్ స్టార్​ మహేశ్​ బాబు. ఈ సినిమా షూటింగ్​ పూర్తయ్యాక.. రాజమౌళితో ప్లాన్​ చేసిన SSMB 29 సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అప్పట్లోనే ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడిన రాజమౌళి.. ఇది 'గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్​' స్టోరీ అంటూ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ సైతం ఈ సినిమా ఫారెస్ట్ అడ్వంచర్ నేపథ్యంలో తెరకెక్కుతుందంటూ పలు మార్లు ఇంటర్వ్యూలల్లో ప్రస్తావించారు.

ABOUT THE AUTHOR

...view details