Rajamouli Ad : తన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది యావత్ సినీ ఇండస్ట్రీని షేక్ చేశారు దర్శక ధీరుడు రాజమౌళి. 'బాహుబలి','ఆర్‌ఆర్‌ఆర్' లాంటి సినిమాలతో జక్కన్న.. ప్రపంచం మొత్తాన్ని తెలుగు ఇండస్ట్రీ వైపు చూసేలా చేశారు. 'నాటు నాటు'తో తెలుగు ఖ్యాతిని ఆస్కార్ వరకు తీసుకెళ్లిన ఈ స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం ఖాళీ లేకుండా మరో మాస్టర్‌పీస్‌ను రూపొందించేందుకు సిద్ధమయ్యారు. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో అడ్వెంచర్ మూవీని తెరకక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమయంలో జక్కన్నకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
Rajamouli oppo Ad : మనం దర్శక ధీరుడిని తెర వెనక ఉండి కథను నడిపించడాన్నే చూసుంటాం. కానీ ఆయన అప్పుడప్పుడు సినిమాల్లో అతిథి పాత్రల్లో కనిపించి తళుక్కన మెరుస్తుంటారు. 'సై','రైంబో','ఈగ', 'బాహుబలి', 'మజ్ను', 'ఆర్‌ఆర్‌ఆర్' లాంటి సినిమాల్లో కాసేపు స్క్రీన్‌పై కనిపించి అలరించారు. అయితే ఆయన్ను పూర్తి నిడివిలో తెరపై చూసింది మాత్రం అరుదే. అయితే తాజాగా ఆయన ఓ యాడ్ షూట్లో నటించి అందరిని ఆశ్చర్యపరిచారు.
ఇటీవలే ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో.. రాజమౌళిని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా చేసుకుంది. ఈ క్రమంలో తమ కొత్త ఫొన్ ప్రమోషన్ కోసం జక్కన్నపై ఓ యాడ్‌ను షూట్ చేశారు. అందులో రాజమౌళి ఓ న్యూ లుక్‌లో కనిపించారు. ఎప్పుడూ సింపుల్‌గా కనిపించే ఆయన.. ఇందులో మరింత స్టైలిష్‌గా కనిపించడం వల్ల అభిమనులు ఔరా అంటున్నారు. ఈ లుక్‌లో జక్కన్న సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Rajamouli Movies : ఇక ఆయన్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే.. 'ఆర్‌ఆర్‌ఆర్'తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ను ఇండస్ట్రీకి అందించిన జక్కన్న.. తెలుగు సినిమా ఖ్యాతిని 'ఆస్కార్' వరకు తీసుకెళ్లారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లను అందుకుని అద్భుతాలను సృష్టించింది. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి ఇప్పుడు.. సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో కలిసి ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనుండగా.. ఈ ఏడాది చివరిలో కానీ, వచ్చే ఏడాది ప్రథమార్ధంలో కానీ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని సినీ వర్గాల టాక్. ఇక రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందిస్తున్నారు.