MM keeravani tweet RRR controversy: 'ఆర్ఆర్ఆర్'పై సౌండ్ ఇంజనీర్, ప్రఖ్యాత అస్కార్ గ్రహీత రసూల్ పూకుట్టి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే అభిమానులు, పలువురు సెలబ్రిటీలు ఆయనకు గట్టి కౌంటర్లు ఇచ్చారు. అయితే సంగీత దర్శకుడు కీరవాణి ఎంట్రీ అవ్వడం వల్ల ఈ వివాదం కొత్త మలువు తీసుకుంది. రసూల్‌ను ఉద్దేశిస్తూ ఆయన వ్యంగ్యంగా చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. "ప్రతిఒక్కరి స్వేచ్ఛను గౌరవిస్తాను. ఇంగ్లీష్ అక్షరాలు టైప్ చేయడం సరిగ్గా రాదు. అప్పర్ కేస్, లోయర్ కేస్ టైపింగ్‌లో బ్యాడ్" అంటూ రసూల్ పూకుట్టి పేరులోని రెండు అక్షరాలను అప్పర్ కేస్‌లో టైప్ చేసి హైలైట్ చేశారు. అది అసభ్యపదజాలం అని నెటిజన్లకు క్లారిటీగా అర్థమవుతోంది. దీంతో ఆయన ట్వీట్ వైరల్‌గా మారింది. దీనికి కొందరు మద్దతు ఇవ్వగా.. మరికొంతమంది సరికాదంటూ కామెంట్లు చేశారు. అయితే ఆ తర్వాత ట్వీట్‌ను డిలీట్ చేశారు.
RRR controversy: రసూల్‌కు కీరవాణి గట్టి కౌంటర్.. ఆ పదాన్ని హైలైట్ చేస్తూ.. - ఆర్ఆర్ఆర్ వివాదం
MM keeravani tweet RRR controversy: 'ఆర్ఆర్ఆర్'పై సౌండ్ ఇంజనీర్, ప్రఖ్యాత అస్కార్ గ్రహీత రసూల్ పూకుట్టి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. అయితే దీనిపై స్పందించిన సంగీత దర్శకుడు రసూల్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. అతడిని ఉద్దేశిస్తూ సోషల్‌మీడియా వేదికగా వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
రసూల్‌కు కీరవాణి గట్టి కౌంటర్
అనంతరం తన టైపింగ్‌లో టైపింగ్ డిఫెక్ట్ పోయిందని, కొత్తగా క్యారెక్టర్ బ్లైండ్‌నెస్ వచ్చిందని పేర్కొన్నారు. తనకు రామ్, భీమ్, ఆలియా పాత్రలు కనిపించడం లేదని.. దేశభక్తుడైన అజయ్ దేవగణ్ పాత్ర ఒక్కటే కనిపిస్తోందని ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి: అలా చేశానని.. నన్ను ఆ యాంగిల్లోనే చూస్తున్నారు: లావణ్య త్రిపాఠి
Last Updated : Jul 6, 2022, 10:16 AM IST