ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచమంతా బ్రహ్మరథం పడుతోంది. ఈ సినిమాకు ఇండియాలో ఎంత క్రేజ్ ఉందో ఓవర్సీస్లోనూ అంతకంటే ఎక్కువ క్రేజ్ ఉందనే చెప్పాలి. సినిమా విడుదలైన కొద్ది రోజులకే బాక్సాఫీస్‌ను షేక్ చేసి పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమాలోని నాటు నాటు పాటకు జనాలు స్టెప్పులు వేయకుండా ఆగలేకపోయారు. కాగా బుధవారం జరిగిన ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ఫంక్షన్లోనూ బెస్ట్ సాంగ్‌గా నిలిచింది.
రామ్-భీమ్ నాటు నాటు.. వీరిద్దరు ఫుట్‌బాల్ ఆడితే అవార్డ్లు పక్కా! - నాటు నాటు సాంగ్
'నాటు నాటు'.. ఆ సాంగ్‌లోని బీట్‌కు అందులోకి లిరిక్స్‌కు ఎవరైనా సరే స్టెప్పులు వేయకుండా ఆగలేదు. అంత ట్రెండ్ అయిన ఈ పాట ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్‌ను గెలుచుకుంది. అయితే ఈ సాంగ్‌ను ఫ్యాన్స్ కొంచం డిఫరెంట్‌గా ఎడిట్ చేసిన సందర్భాలున్నాయి. ఓ సారి ఆ వీడియోను చూసేద్దామా.
naatu naatu song football version
అయితే ఈ పాటను ఎన్నో రకాలుగా రీమేక్ చేశారు ఫ్యాన్స్. అందులోని 'నాటు' స్టెప్‌కు ఫుట్‌బాల్ జోడించి క్రియేట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇలా ఆడితే రామ్, భీమ్‌లు గోల్స్ సులభం కొట్టేస్తారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే, అల్లు అర్జున్ డ్యాన్స్ చేస్తున్న బిట్‌కు ఫుట్‌బాల్ జోడించి క్రియేట్ చేసిన వీడియో కూడా ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. మీరూ ఆ వీడియోను చూసేయండి.