RRR Movie Box Office Collections: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 24న విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టింది. వెయ్యి కోట్లకుపైగా వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా సత్తా చాటింది. ఈ చిత్రం ఓవర్సీస్‌లోనే రూ. 300 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టగా.. బాలీవుడ్‌లో కూడా రూ.300 కోట్లు వసూలు చేసింది. తాజాగా ఈ చిత్రం నాలుగు వారాల కలెక్షన్లను వెల్లడించింది మూవీ యూనిట్. 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్ల కలెక్షన్లను రాబట్టినట్లు తెలిపింది.
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.350 కోట్లకుపైగా వసూలు చేయగా.. కన్నడ, తమిళం, మలయాళంలో సుమారు మరో వంద కోట్లకుపైగా కలెక్షన్లు వచ్చాయి. భారత్‌లో మాత్రమే 700 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది ఈ మూవీ. దీంతో 'బాహుబలి' తర్వాత రెండోస్థానంలో 'ఆర్ఆర్ఆర్' నిలిచింది. అయితే ఈ చిత్రం 1100 కోట్లు గ్రాస్ కలెక్షన్ సాధించినా షేర్ మాత్రం రూ. 600 కోట్లకే పరిమితమైంది. ప్రస్తుతం ఆర్ఆర్‌ఆర్ వసూళ్లు క్లోజింగ్‌కు చేరుకున్నాయి. మహా అయితే మొత్తంగా మరో 50 నుంచి 100 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
KGF Chapter 2 8 Days Collections : యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన 'కేజీఎఫ్-2' సినిమా.. నార్త్ సౌత్ అంటూ తేడా లేకుండా బాక్సాఫీస్‌ను ఓ రేంజ్‌లో షేక్ చేస్తోంది. అంతేకాదు ఈ సినిమాతో కన్నడ నటుడు యశ్ కెరీర్ మలుపు తిరిగిందనే చెప్పొచ్చు. ఈ సినిమా హిందీ బెల్ట్‌లో కూడా ఇరగదీస్తోంది. మొదటి వారంలోనే అక్కడ 'బాహుబలి 2', 'ఆర్ఆర్ఆర్' రికార్డులను బద్దలు కొట్టి దూసుకుపోతోంది. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓ రేంజ్‌లో టాక్ తెచ్చుకుంది. మొదటి రోజే బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది. హిందీలో కూడా ఆల్ టైమ్ ఫస్ట్ డే రికార్డు సృష్టించింది.