RRR Hollywood actor Olivia Morris: బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ 'ఆర్‌ఆర్‌ఆర్'తో తెలుగు తెరకు పరిచయమైన బ్రిటీష్ నటి ఒలీవియా మోరీస్. తారక్ లవ్ లేడీ జెన్నీఫర్ పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు సినీ ప్రియుల్ని ఎంతో ఆకట్టుకుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సక్సెస్‌లో భాగంగా తాజాగా ఒలీవియా ఓ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. కెరీర్ ఆరంభంలోనే ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి అద్భుతమైన ప్రాజెక్ట్‌లో భాగం కావడం తనకెంతో ఆనందాన్ని అందించిందని ఆమె చెప్పుకొచ్చారు.
ఆ సీన్లో తారక్‌ను చూసి కన్నీళ్లు వచ్చాయి: హాలీవుడ్ భామ - RRR movie ntr heroine
RRR Hollywood actor Olivia Morris: 'ఆర్‌ఆర్‌ఆర్' ఘన విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు ఈ చిత్రంలో నటించిన బ్రిటీష్ నటి ఒలీవియా మోరీస్. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం తనకెంతో ఆనందాన్ని అందించిందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ అద్భతమైన నటుడని కితాబిచ్చారు.
"ఆర్‌ఆర్‌ఆర్’ ఆడిషన్స్ కోసం వీడియో షూట్ చేసి పంపించాను. కొన్ని నెలల పాటు టీమ్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఒక రోజు ఆ టీమ్ నుంచి ఫోన్ రావడం, నేను వాళ్లకు ఓకే కావడం వెంట వెంటనే జరిగిపోయాయి. రాజమౌళి గొప్ప దర్శకుడు. ఏ సీన్‌ని ఎలా తెరకెక్కించాలనే విషయంలో ఆయనకు స్పష్టత ఉంటుంది. నటీనటులను తనకు కావాల్సిన విధంగా ఆయన మలచుకోగలడు. తారక్ అద్భుతమైన వ్యక్తి. సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఎంతో సరదాగా ఉంటాడు. సెట్‌లో ఎక్కువగా నవ్విస్తుంటాడు. సినిమా విడుదలయ్యాక నా బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ‘ఆర్‌ఆర్‌ఆర్’ చూశా. ‘కొమురం భీముడో’ పాటలో తారక్‌ను చూసి కన్నీళ్లు వచ్చేశాయి. ఆ పాటలో వచ్చే సన్నివేశాలకు నేనెంతో భావోద్వేగానికి గురయ్యా. ఇక చరణ్ గురించి చెప్పాలంటే తను నాకు మంచి స్నేహితుడయ్యాడు. మేమిద్దరం లండన్ పరిసర ప్రాంతాల గురించి ఎక్కువగా మాట్లాడుకునేవాళ్లం. ‘ఆర్‌ఆర్‌ఆర్’లో నాటునాటు పాట నాకెంతో నచ్చింది. నా బాయ్‌ఫ్రెండ్ కూడా ఆ పాటకు ఫ్యాన్ అయ్యాడు. ఇంట్లో తరచూ అదే పాట పాడుతున్నాడు. డ్యాన్స్ కూడా ట్రై చేస్తున్నాడు’" అని ఒలీవియా తెలిపారు.
ఇదీ చూడండి:'ఆర్‌ఆర్‌ఆర్' సీక్వెల్.. జక్కన్న, తారక్, చరణ్ ఏం అన్నారంటే?