రామ్‌చరణ్‌కు వారసుడు రాబోతున్నాడని ఇటీవల మెగాస్టార్ చింరజీవి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో అభిమానులు ఫుల్ ఖూషీ అయ్యారు. త్వరలో జూనియర్ రామ్‌చరణ్ రాబోతున్నారని పండగ చేసుకున్నారు. కాగా, రామ్‌చరణ్-ఉపాసన దంపతులు సరోగసీ ద్వారా బిడ్డను కనబోతున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై రామ్‌చరణ్, ఉపాసన స్పందించలేదు. తాజాగా మెగా వారసుడి గురించి మరో వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
ఉపాసన సరోగసీ వివాదానికి చెక్.. బేబీ బంప్ ఫొటోలు వైరల్! - రామ్ చరణ్ భార్య బేబీ బంప్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు వారసుడు రాబోతున్నాడని తెలియగానే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా ఉపాసన బేబీ బంప్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో సరోగసీ వార్తలకు చెక్ పడినట్లైంది.
ఉపాసన తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్ చేశారు. ఆ ఫొటోలలో బేబీ బంప్ కనిపిస్తోందని తెగ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. దీంతో సరోగసీ వార్తలకు చెక్ పెట్టినట్టు అయింది. కానీ ఈ విషయంపై ఉపాసన ఇప్పటి వరకు స్పందించలేదు. ఏది ఏమైనప్పటికీ ఈ ఫొటోలతో అభిమానులు.. సరోగసీ కాదని సంతృప్తి పడుతున్నారు.
పిల్లలెప్పుడు..
పెళ్లై పదేళ్లు అవుతున్నా చరణ్ దంపతులు ఎలాంటి శుభవార్త చెప్పకపోవడం వల్ల 'పిల్లలెప్పుడు' అంటూ అనేక సందర్భాల్లో ఉపాసనకు ప్రశ్నలు ఎదురయ్యేవి. అయితే వాటిపై ఉపాసన స్పందించేవారు కాదు. ఇదే విషయమై ఇటీవల ఆధ్యాత్మిక గురువు జగ్గీవాసుదేవ్ కార్యక్రమంలో తాను వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించారు. "మా పెళ్లై పదేళ్లయింది. నా వైవాహిక జీవితం చాలా చాలా ఆనందంగా ఉంది. నా జీవితం, నా కుటుంబాన్ని నేనెంతో ప్రేమిస్తున్నా. ఇదిలా ఉంటే కొంతమంది అదే పనిగా నా ఆర్ఆర్ఆర్ (రిలేషన్‌షిప్, రీప్రొడ్యూస్, రోల్ ఇన్ మై లైఫ్) గురించి ప్రశ్నిస్తుంటారు ఎందుకు?. ఈ పరిస్థితి నా ఒక్కదానికే కాదు ఎందరో మహిళలకు ఎదురవుతోంది" అని ఉపాసన అడగ్గా, జగ్గీవాస్ దేవ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.