మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాలీవుడ్ లో తెరంగేట్రం చేయబోతున్నట్లు ప్రకటించాడు. త్వరలోనే ఓ హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నట్లు స్వయంగా వెల్లడించారు. అయితే, ఏ చిత్రంలో నటిస్తున్నారనే వివరాలు మరికొన్ని నెలల్లో తెలుస్తాయని వెల్లడించారు. ప్రస్తుతం ఆస్కార్ అవార్డుల కోసం అమెరికా పర్యటనలో ఉన్న రామ్ చరణ్.. అక్కడి ప్రముఖ షో టాక్ ఈజీ పాడ్ కాస్ట్ లో మాట్లాడారు. 'ర్ఆర్ఆర్' చిత్ర విశేషాలతో పాటు తనకు ఇష్టమైన హాలీవుడ్ చిత్రాలు, నటీనటుల వివరాలు పంచుకున్నారు. నటుడిగా అన్ని దేశాల చిత్రాల్లో నటించాలనుందని ఆకాంక్షించిన చరణ్.. త్వరలోనే ఓ హాలీవుడ్ సినిమాలో నటిస్తానన్నారు. ప్రస్తుతానికి ఆ విషయంలో చర్చలు కొనసాగుతున్నట్లు ప్రకటించాడు. అలాగే భారత్‌లో ప్రతి రాష్ట్రం దేనికదే ప్రత్యేకమని పేర్కొన్నారు. ప్రాంతాన్ని బట్టి భాష, సంస్కృతులు మారుతాయని.. ఉత్తరాది, దక్షిణాది అనే మాట చెరిపేసి భారతీయ సినిమా ఒక్కటే అని చాటిచెప్పేలా రాజమౌళితోపాటు తామంతా కృషి చేస్తున్నట్లు రామ్ చరణ్ వివరించారు.
రామ్‌చరణ్ హాలీవుడ్ ఎంట్రీ.. త్వరలోనే సెట్స్‌పైకి సినిమా! - ram charan hollywood movie talk easy pod cast
'ఆర్ఆర్ఆర్' సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రామ్‌చరణ్. తాజాగా ఈ స్టార్ అదిరిపోయే అనౌన్స్మెంట్ ఇచ్చారు. త్వరలోనే ఓ హాలీవుడ్ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఆ వివరాలు..
'ఆర్సీ 15' టైటిల్ ఫిక్స్!
వరుస సినిమాలతో దూసుకెళ్తున్న రామ్ చరణ్.. ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం 'ఆర్సీ 15' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. కాగా, సినిమా గురించి ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాకు సీఈఓ(ఛీప్ ఎలక్టోరల్ అఫీసర్) అని పేరు పెట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కాగా, ఇంతకుముందు కూడా ఈ సినిమాకు నాయకుడు, అధికారి అనే పేర్లను పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదే కాకుండా రామ్ చరణ్‌కు ఈ సినిమాలో 27 గెటప్స్ ఉంటాయని.. మరోవైపు ఎలక్షన్ కమీషనర్‌గా, ముఖ్యమంత్రిగా రెండు పాత్రల్లో కనిపిస్తారని ఊహాగానాలు వినబడుతున్నాయి. వీటన్నింటికీ తెరపడాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సింది. కాగా, ఈ సినిమా టైటిల్ రామ్ చరమ్ బర్త్ డే మార్చి 27న విడుదల చేస్తారని తెలుస్తోంది. దీనిపై కూడా చిత్ర బృందం అధికారికంగా స్పందించలేదు.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది 'ఆర్సీ15'. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో కియారా అడ్వాణీ, అంజలితో పాటు ఎస్‌జే సూర్య, నవీన్ చంద్ర, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నచిస్తున్నారు. కాగా, ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.