తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'RRR-2'పై క్లారిటీ ఇచ్చిన జక్కన్న.. త్వరలోనే గుడ్ న్యూస్? - ఆర్​ఆర్​ఆర్​ 2 రాజమౌళి క్లారిటీ

RRR 2 Movie Rajamouli: ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించిన 'ఆర్ఆర్ఆర్' సినిమాకు సీక్వెల్ రానుంది. ఈ విషయంపై ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే?

RRR 2 Movie Rajamouli:
RRR 2 Movie Rajamouli:

By

Published : Nov 13, 2022, 3:19 PM IST

RRR 2 Movie Rajamouli: దర్శకధీరుడు ఎస్​ఎస్​ రాజమౌళి రూపొందించిన సినిమా 'ఆర్​ఆర్ఆర్'. ఈ ఏడాది మార్చిలో విడుదలై బాక్సాఫీస్​ వద్ద రికార్డుల బద్దలు కొట్టింది. పీరియాడికల్ యూక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. కొమురం భీంగా జూనియర్ ఎన్టీఆర్, సీతారామరాజుగా రామ్​చరణ్ అద్భుతంగా నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు.

అయితే 'ఆర్ఆర్ఆర్' సినిమాకు సీక్వెల్ రావాలని ఎంతో మంది అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే దర్శకుడు రాజమౌళి స్పందించారు. 'ఆర్ఆర్ఆర్' మూవీ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం చికాగో పర్యటనలో ఉన్న ఆయన.. 'ఆర్​ఆర్​ఆర్​'కు సీక్వెల్ రాబోతున్నట్లు వెల్లడించారు. అక్కడి అభిమానులు, మీడియా అడిగిన సీక్వెల్ ప్రశ్నలపై జక్కన్న స్పందించారు.

"నేను తీసే ప్రతీ సినిమా కథ మా నాన్న విజయేంద్ర ప్రసాద్ రాస్తారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా కథను కూడా ఆయనే రాశారు. ఈ నేపథ్యంలోనే 'ఆర్ఆర్ఆర్-2' కథ పైనా చర్చలు జరుగుతున్నాయి. అవన్నీ ప్రస్తుతం ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయి" అని వెల్లడించారు.

మొత్తానికి 'ఆర్ఆర్ఆర్' మూవీకి సీక్వెల్ ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రకటనతో టాలీవుడ్​తో పాటు దేశ, విదేశాల్లో సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం అందుకుంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం రాజమౌళి.. మహేశ్​ బాబుతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ప్రపంచ యాత్రికుడిగా మహేశ్ ఈ సినిమాలో కనిపించనున్నట్లు ఇప్పటికే జక్కన్న క్లారిటీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details