తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

గుర్తుపట్టరానంతగా మారిపోయిన నటి.. ఆ ట్రీట్​మెంట్​ వికటించి... - బెంగళూరు

దంతవైద్యం వికటించి ఓ యువనటి ముఖం పూర్తిగా వాచిపోయింది. అస్సలు గుర్తుపట్టరానంతగా మారింది. చికిత్స అనంతరం రెండు మూడు రోజుల్లో వాపు తగ్గుతుందని వైద్యులు చెప్పినా.. 3 వారాలైనా ఎలాంటి మార్పులేదని బాధిత కన్నడ నటి స్వాతి వాపోయింది.

kannada actor swathi sathish
kannada actor swathi sathish

By

Published : Jun 20, 2022, 6:39 PM IST

దంతవైద్యం వికటించి కర్ణాటకకు చెందిన ఓ యువనటి ముఖం గుర్తుపట్టరానంతగా మారిపోయింది. కన్నడ యువనటి స్వాతి.. బెంగుళూరులోని ఓ దంత వైద్యశాలలో రూట్‌ కెనాల్‌ చికిత్స చేయించుకుంది. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న తర్వాత ఆమె ముఖం ఉబ్బిపోయింది. విపరీతమైన వాపుతో గుర్తు పట్టలేనంతగా మారింది.

బాధితురాలు రూట్‌ కెనాల్‌ చేసిన వైద్యులను సంప్రదించగా.. వాపు రెండు మూడు రోజుల్లో తగ్గుతుందని చెప్పారని, 3 వారాలైనా ఎలాంటి పురోగతి లేదని వాపోయింది. వాపుతోపాటు ముఖమంతా నొప్పిగా ఉన్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. అనస్థీషియాకు బదులుగా సాలిసిలిక్ యాసిడ్ ఇవ్వటం వల్లనే ముఖంపై వాపు ఏర్పడినట్లు మరో ఆస్పత్రిని సంప్రదించగా తెలిసినట్లు యువనటి స్వాతి పేర్కొంది. కోలుకున్న తర్వాత ఆ ఆస్పత్రిపై కేసు వేయనున్నట్లు స్వాతి హెచ్చరించింది. సామాజిక మాధ్యమాల్లో యువనటి స్వాతి ముఖం వాచిన చిత్రాలు వైరల్‌గా మారాయి.

ఇదీ చూడండి:ఫ్యాట్​ సర్జరీ వికటించి ప్రముఖ టీవీ నటి మృతి.. 21 ఏళ్లకే..

ABOUT THE AUTHOR

...view details