Robo Film Insurance Cost In India :సినిమా బీమా (ఫిల్స్ ఇన్సూరెన్స్) మన దేశంలో ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. విదేశాల్లో ఈ విధానం ఇప్పటికే అమలు అవుతోంది. చిన్నా, పెద్ద సినిమాలన్న తేడా లేకుండా పాశ్చాత్య దేశాల్లో సినిమా బీమా చేస్తారు. కానీ, మన దేశంలో కేవలం 5 నుంచి పది శాతం మాత్రమే ఫిల్మ్ ఇన్సూరెన్స్ చేస్తున్నారు. ప్రతిష్టాత్మక సినిమాలు తీసిన సందర్భాల్లో ఫిల్మ్ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం. తమిళ సినీ పరిశ్రమలో భారీ బడ్జెట్ సినిమాలు తీయడం చాలా అరుదు. కోలివుడ్‌లో భారీ చిత్రాలకే పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని నేపథ్యంలో అదే పరిశ్రమకు చెందిన రజనీకాంత్ సినిమా భారీ మొత్తంలో ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది.
మన దేశంలో అత్యంత ఖరీదైన సినిమా బీమా
ప్రముఖ హీరో రజనీకాంత్ నటించిన 'రోబో 2.0' సినిమా రూ.330 కోట్ల బీమాతో రికార్డు సృష్టించింది. 2016లో శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. న్యూ ఇండియా అస్యూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలు ఆ సినిమాకు బీమా రక్షణ కల్పించాయి.
అదేవిధంగా బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్ నటించిన రాజ్‌కుమార్ హిరానీ 'పీకే' చిత్రం ఇన్సూరెన్స్ రికార్డు రూ.300 కోట్ల రికార్డును రోబో అధిగమించినట్లైంది. వాస్తవానికి తమిళ సినిమాలు సాధారణంగా రూ.330 కోట్లు కలెక్షన్లు వసూలు చేసే స్థితిలో లేవు. తమిళ చిత్రసీమలో బడా హీరోలు దళపతి విజయ్, అజిత్ సినిమాలే ఎక్కువ వసూళ్లు చేస్తుంటాయి. వారిద్దరూ కూడా 330 కోట్ల రూపాయల కన్నా వసూలు చేసిన సినిమాలు ఎప్పుడూ చేయలేదు.