తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Rithu Chowdary : 'అతడి వల్ల ఆర్థికంగా మోసపోయా.. మానసికంగా కుంగిపోయా!' - రీతూ చౌదరి కొత్త ఇల్లు

Rithu Chowdary House Issue : సోషల్​మీడియా బ్యూటీ రీతూ చౌదరి.. ఓ వ్యక్తి వల్ల మానసికంగా ఎంతో బాధపడ్డారట. సుమారు రూ.2లక్షలకు పైగా నష్టపోయ్యారట. ఈ విషయాన్ని తన యూట్యూబ్​ ఛానల్​లో​ ఆమెనే చెప్పారు. అసలేం జరిగిందంటే?

Rithu Chowdary
Rithu Chowdary

By ETV Bharat Telugu Team

Published : Oct 29, 2023, 8:02 AM IST

Updated : Oct 29, 2023, 11:47 AM IST

Rithu Chowdary House Issue : సోషల్‌మీడియా తార రీతూ చౌదరి.. ఓ ఇంటీరియర్‌ డిజైనర్‌ వల్ల తాను మానసిక ఆందోళనకు గురయ్యానని ఆరోపించారు. అతడిని నమ్మి ఇంటి పనిని అప్పగిస్తే ఏదీ సరిగ్గా చేయలేదని, దాంతో తాను దాదాపు రూ.2 లక్షలు నష్టపోయానని తెలిపారు.

"కొంతకాలం క్రితం నేనొక ఇంటిని తీసుకున్నా. దాదాపు ఆరు నెలల క్రితం ఆ ఇంటి వీడియోను మీ అందరితో పంచుకున్నా. ఆనాటి నుంచి ఇప్పటికీ ఇంటీరియర్‌ వర్క్‌ జరుగుతూనే ఉంది. మధ్యలో చాలా సమస్యలు రావడం వల్ల పని ఆలస్యమైంది. ఇంటికి పెద్ద దిక్కుగా ఉండే నాన్న చనిపోవడం వల్ల నేను ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నా. ముఖ్యంగా ఈ ఇంటి విషయంలో... ఈ ఇల్లు కొన్నాక నేను తీవ్ర మానసిక కుంగుబాటుకు లోనయ్యా. ఆర్థికంగా మోసపోయా. డబ్బులు పోగొట్టుకున్నా. కన్నీళ్లు పెట్టుకున్నా"

-- రీతూ చౌదరి

"ఇంటీరియర్‌ వర్క్‌ను మొదట మేము ఒక వ్యక్తికి అప్పగించాం. అతడికి రూ.5లక్షలు ఇచ్చా. పని రాకపోతే రాదని చెప్పకుండా ఇష్టం వచ్చినట్లు సగం సగం పనులు చేశాడు. దాంతో అతడిని పనిలో నుంచి తీసేసి.. డబ్బులు తిరిగి ఇవ్వమన్నా. ఫోన్లు చేస్తే స్పందించేవాడు కాదు. అనరాని మాటలు అనేవాడు. ఓవైపు బ్యాంక్‌ ఈఎంఐలు కట్టుకుంటూ మరోవైపు ఇంటి పని పూర్తి కాక మానసికంగా ఎంతో సతమతమయ్యా. చివరకు పోలీసుల ప్రమేయంతో కొంత డబ్బు తిరిగి ఇచ్చాడు. ఇంటీరియర్‌ వర్క్‌ను ఇప్పుడు వేరే వాళ్లకు అప్పగించా. నాకు ఎదురైన ఇబ్బంది ఎవరికీ రాకూడదనే ఉద్దేశంతోనే ఈ వీడియో షేర్‌ చేస్తున్నాను" అని ఆమె చెప్పారు.

జబర్దస్త్​ షోతో పాపులారిటీ సంపాదించారు రీతూ చౌదరి. జబర్దస్త్​ టీమ్​ లీడర్ హైపర్​ ఆది టీమ్​లో కనిపిస్తూ కామెడీకి గ్లామర్​ జోడించారు రీతు. ఆ తర్వాత శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో కూడా మెరిశారు. అందులో అప్పుడప్పుడు సూపర్​ హిట్ పాటలకు చిందులేస్తూ.. విశేష అభిమానులను సొంతం చేసుకున్నారు. మొదట 'గోరింటాకు' అనే సీరియల్​లో నటించిన రీతూ చౌదరి.. ప్రస్తుతం కొన్ని సీరియళ్లలో నటిస్తూ బిజీగా ఉంటోంది ఈ అమ్మడు. సీరియళ్లలో, టీవీ షోలలో కనిపిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకంటున్న ఈ ముద్దుగుమ్మకు నెట్టింట ఫాలోయింగ్​ బాగానే ఉంది. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్​గా ఉండే రీతూ చౌదరి.. ఇన్​స్టా గ్రామ్​లో రీల్స్​ చేస్తూ, తన గ్లామర్​ ఫొటోషూట్లను పోస్ట్​ చేస్తూ ఫాలోయర్లను పెంచుకుంటున్నారు.

Last Updated : Oct 29, 2023, 11:47 AM IST

ABOUT THE AUTHOR

...view details