'శివ'.. తెలుగు సినిమా ఉన్నంతకాలం ఈ సినిమా గుర్తుంటుంది. నాగార్జున హీరోగా రామ్గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ మూవీకి సంబంధించి.. ఓ ప్రశ్న ఎదురైనప్పుడు ఆర్జీవీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. 'శివ సినిమా తీసిన రామ్గోపాల్ వర్మ చనిపోయాడు' అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఈటీవీలో ప్రసారం అయ్యే 'ఆలీతో సరదా'గా కార్యక్రమానికి ఈ వారం అతిథిగా రామ్గోపాల్ వర్మతో పాటు తను ఇటీవల తెరకెక్కించిన డేంజరెస్ సినిమాలోని హీరోయిన్లు అప్సర వాణి, నైనా గంగూలీ కూడా హాజరయ్యారు.
'శివ సినిమా తీసిన రామ్గోపాల్ వర్మ చనిపోయాడు'
'శివ సినిమా తీసిన రామ్గోపాల్ వర్మ చనిపోయాడు'.. ఈ మాట అన్న అన్నది ఎవరో కాదు. స్వయంగా ఆర్జీవీనే ఈ మాట అన్నారు. ఇంతకీ ఆయన ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? అసలేమైంది?
ఈ సందర్భంగా ఆలీ అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు వర్మ. 'మీరు సీఎం అయితే ఏం చేస్తారు' అని ఆర్జీవీని అలీ అడిగారు. ' ట్రెజరీలో ఉన్న డబ్బంతా తీసుకొని.. వేరే దేశానికి వెళ్లిపోతా' అని ఆర్జీవీ సమాధానం చెప్పారు. ఈ కొత్త ఎపిసోడ్ ఈ నెల 9న ప్రసారం కానుంది. స్వలింగసంపర్కుల కథాంశంతో డేంజరెస్ సినిమాను తెరకెక్కించారు రామ్గోపాల్ వర్మ. అయితే సినిమాపై వివాదం చెలరేగుతుండగా.. విడుదల వాయిదా పడుతూ.. వస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 6న ఎలాగైనా విడుదల చేయాలని వర్మ భావిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఇది విడుదల కానుంది.
ఇదీ చదవండి:RRR: అనుకున్న తేదీకి ముందే ఓటీటీలో ‘ఆర్‌ఆర్‌ఆర్’.. కానీ ఓ కండీషన్!