'లాల్ సింగ్ చద్దా' మూవీ తర్వాత కొద్ది నెలలు సినిమాలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్. తాజాగా ఆయన మళ్లీ రంగంలోకి దిగారు. స్పానిశ్ మూవీ 'ఛాంపియన్స్' హిందో రీమేక్ కోసం ఆమిర్ సన్నాహాలు మొదలు పెట్టారట. అందుకోసం బీటౌన్ మరో స్టార్ హీరో కండలవీరుడు సల్మాన్ ఖాన్‌ను సంప్రదిస్తున్నారట. అంటే సల్మాన్- ఆమిర్ 29 ఏళ్ల తర్వాత ఒకే ప్రాజెక్ట్ కోసం పనిచేయనున్నారన్నమాట. వీరిద్దరూ కలిసి 1994లో విడుదలైన అందాజ్ అప్నా అప్నా సినిమాలో నటించారు.
ఫ్యాన్స్‌కు పండగే.. ఒకే సినిమాలో ఆమిర్- సల్మాన్.. 29 ఏళ్ల తర్వాత కాంబో రిపీట్! - సల్మాన్ ఖాన్ ఆమిర్ ఖాన్ అప్డే
బాలీవుడ్ స్టార్ హీరోలు.. ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ 29 ఏళ్ల తర్వాత ఒకే సినిమా కోసం పనిచేయనున్నారట. అందులో సల్మాన్ కీలక పాత్ర పోషించనుండగా.. ఆమిర్ పూర్తి బాధ్యతలు చూసుకోనున్నారట. అసలు ఏ సినిమా ఏంటంటే?
సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. 'ఛాంపియన్స్' హిందీ రీమేక్‌లో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషించనున్నారట. ఆమిర్.. సినిమా పూర్తి బాధ్యతలను నిర్వర్తించనున్నారట. వీరిద్దరూ ఇప్పిటికే స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలుపెట్టారట. లొకేషన్లు, షూటింగ్ షెడ్యూల్‌తోపాటు ఇతర విషయాలు మాట్లాడుకున్నారట. అంతా ఓకే అయితే వచ్చే నెలలో సల్మాన్ ఖాన్ పుట్టినరోజు నాడు మూవీని అధికారికంగా ప్రకటించబోతున్నారట. అయితే సల్మాన్ భాయ్.. ఇంకా అగ్రిమెంట్‌పై సంతకం చేయలేదట. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది సినిమా విడుదల కానుందట. అయితే సల్మాన్.. కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌లో బిజీగా ఉన్నారట. అది పూర్తయ్యాకనే షెడ్యూల్ మొదలయ్యే అవకాశం ఉందని బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
రీసెంట్గా ఆమిర్ ఖాన్ హీరోగా విడుదలైన 'లాల్ సింగ్ చద్దా' చిత్రం.. ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. హాలీవుడ్‌లో సూపర్‌హిట్ అందుకున్న 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో నాగచైతన్య కీలకపాత్ర పోషించగా.. కరీనా కపూర్ కథానాయికగా నటించారు. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆయన సరసన తొలిసారి పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే నటిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ ఈ సినిమాలో అతిథి పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 21న రిలీజ్ కానుంది.