ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో రాజమౌళి సృష్టించిన సంచలనం ఆర్ఆర్ఆర్. అయితే ఈ సినిమాపై ఆర్జీవీ నుంచి మొదలైన అనుచిత వ్యాఖ్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా 'ఆర్ఆర్ఆర్'పై సౌండ్ ఇంజనీర్, ప్రఖ్యాత అస్కార్ గ్రహీత.. రసూల్ పూకుట్టి తన అక్కసును వెల్లగక్కారు. అయితే రసూల్ పూకుట్టి వ్యాఖ్యలపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ గట్టి కౌంటర్ ఇచ్చారు. నాకు ఆ సినిమా అలా అనిపించలేదని, ఒక వేళ అయితే తప్పేంటని తనదైన శైలిలో స్పందించారు.
"ఆర్ఆర్ఆర్ సినిమా నాకు గే స్టోరీలా అనిపించలేదు. ఒకవేళ అది గే స్టోరీ అయితే తప్పేంటి? అందులో చెడ్డ విషయం ఏముంది? మీ వ్యాఖ్యలను ఎలా సమర్థించుకోగలరు? మీ లాటి స్థాయి ఉన్న వాళ్లు ఇంత దిగజారడం బాధగా ఉంది"
-శోభు యార్లగడ్డ, బాహుబలి నిర్మాత
రసూల్ పూకుట్టి అసలు ఏం అన్నారు?
'ఆర్ఆర్ఆర్' సినిమా 'గే లవ్ స్టోరీ' అంటూ రసూల్ పూకుట్టి ట్విట్టర్లో ఆదివారం కామెంట్ చేశారు. అయితే దీనిపై 'ఆర్ఆర్ఆర్' అభిమానులు రసూల్ పూకుట్టిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'నిన్న రాత్రి ఆర్ఆర్ఆర్ అనే చెత్త సినిమా 30నిమిషాలు చూశా' అని నటుడు, రచయిత మునీష్ భరద్వాజ్.. ఆదివారం ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన రసూల్ పూకుట్టి 'గే లవ్ స్టోరీ' రీ ట్వీట్ చేశారు. ఆలియా భట్‌ను ఆసరాగా ఉయోగించుకున్నారని, అమెకు ఎలాంటి ప్రాధాన్యం లేదని మరో ట్వీట్లో చెప్పుకొచ్చారు. దీనిపై రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్ అభిమానులు కోపంగా రియాక్ట్ అవుతున్నారు. 'ఆస్కార్ స్థాయి వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేస్తారని అనుకోలేదు' అని ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు. తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడాన్ని జీర్ణించుకోలేకే.. ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కామెంట్ల రూపంలో విమర్శలు వెల్లువెత్తడం వల్ల రసూల్ పూకుట్టి మరోసారి ట్విట్టర్ వేదికగా స్పందించారు. అయితే తనంతట తాను అనలేదని, పబ్లిక్ డొమైన్లో ఉన్నదే చెప్పానంటూ.. మరింత రెచ్చగొట్టేలా పోస్ట్ పెట్టారు. 1920 నాటి కథాంశంతో అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ నేపథ్యంతో ఈ కథను తెరకెక్కించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1200 కోట్ల వసూళ్లను రాబట్టింది.
ఇదీ చదవండి:DJ Tillu: ఏమైంది రాధికా.. సీక్వెల్లో ఉండవా?