Republic day and February Movies : సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు ప్రతి ఏడాది చాలా సినిమాలు రెడీ అవుతుంటాయి. అయితే థియేటర్లు సరిపడకపోవడం వల్ల లేదా ఇతర కారణాల వల్ల చివరకు నాలుగో, ఐదో చిత్రాలు బాక్సాఫీస్ ముందుకు వచ్చి సందడి చేస్తుంటాయి. అలా వాయిదా పడిన సినిమాలు రిపబ్లిక్ డే, ఫిబ్రవరి ప్రథమార్ధంలోనో రిలీజ్ అవుతుంటాయి. ఈ సారి అలా వస్తున్న చిత్రాలేంటో చూద్దామా.
- ఈ సంక్రాంతికి రావాల్సిన 'కెప్టెన్ మిల్లర్'(Captain Miller Release Date) తెలుగు వెర్షన్ జనవరి 25న రానుంది. ధనుశ్, ప్రియాంక అరుళ్ మోహన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కించారు.
- ఈ సంక్రాంతికి రావాల్సిన మరో తమిళ చిత్రం 'అయలాన్'(Ayalaan release date). శివ కార్తికేయన్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటించారు. దర్శకుడు రవికుమార్ తెరకెక్కించారు. గ్రహాంతర వాసి నేపథ్యంతో భారీ విజువల్స్‌తో రూపొందించిన ఈ చిత్రం రిపబ్లిక్ డేకు రాబోతున్నట్లు టాక్.
- గతేడాది మూడు చిత్రాలతో అలరించిన మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ ఈ ఏడాదిలో ముందుగా 'మలైకోటై వాలియన్'తో బాక్సాఫీసు ముందుకు రాబోతున్నారు. లిజో జోస్ పెల్లిస్సేరి దర్శకత్వం వహించారు. ఈ సినిమా జనవరి 25న రిలీజ్ కానుంది.
- హృతిక్ రోషన్, దీపికా పదుకొణె జంటగా నటించిన యాక్షన్ ఫిల్మ్ ఫైటర్(Fighter Release Date). సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది.
- ఒకే ఒక్క పాత్రతో ఎడిటింగ్ లేకుండా సింగిల్ షాట్‌లో షూట్ చేసిన చిత్రం '105 మినిట్స్' (One Not Five Minuttess). హన్సిక హీరోయిన్. రాజు దుస్సా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని జనవరి 26న రిలీజ్ చేయబోతున్నారు.
ఫిబ్రవరి రెండో వారం..
- ఫిబ్రవరి 9న హీరో రవితేజ పాన్ ఇండియా చిత్రం ఈగల్ విడుదల కానుంది.
- టిల్లు స్క్వేర్ ఫిబ్రవరి 9నే ప్రేక్షకుల ముందుకు రానుంది.
- సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ఊరు పేరు భైరవకోన(Ooru Peru Bhairavakona)ను ఫిబ్రవరి 9న రిలీజ్ చేయనున్నారు. వీఐ ఆనంద్ దర్శకుడు.
- రజనీకాంత్ కీలక పాత్ర పోషించిన లల్ సలామ్ కూడా ఫిబ్రవరి 9నే రాబోతోంది. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటించారు. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించారు.